epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

షాపుల్ని అమ్మేద్దాం.. స్థలాలను వేలం వేద్దాం

కలం డెస్క్ : హౌజింగ్ బోర్డుకు (Telangana Housing Board) చెందిన కమర్షియల్ దుకాణాల్లో (Commercial Shops) ప్రస్తుతం అద్దెకుంటున్నవారు కొనడానికి ఆసక్తి చూపితే వాటిని అమ్మివేయడానికి రాష్ట్ర సర్కారు సిద్ధమవుతున్నది. మార్కెట్ ధర (Market Rate) ప్రకారం విక్రయించడానికి అవసరమైన ప్రణాళికలను తయారు చేయాలని సంబంధిత అధికారులకు ఆ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Ponguleti Srinivasa Reddy) సూచనలు చేశారు. షాప్ నిర్వహించుకునేందుకు ఆ స్థలం అనువుగా లేనట్లయితే దాన్ని వేలం  ద్వారా అమ్మివేయాలని సూచించారు. లీజు అగ్రిమెంట్‌ను రెన్యూవల్  చేసుకోని సంస్ధ‌ల‌కు హౌసింగ్ బోర్డు త‌ర‌పున లేఖలు రాసి రెగ్యుల‌రైజేష‌న్‌ చేయడానికి అవ‌కాశం ఇవ్వాల‌ని అధికారుల‌కు సూచించారు.

షాపుల ద్వారా కోట్లాది రూపాయల బకాయిలు :

రాష్ట్రంలో హౌసింగ్ బోర్డుకు వివిధ ప్రాంతాల్లో 301 క‌మర్షియ‌ల్ (Commercial Shops) షాపులు ఉన్నాయి. వైఎస్సార్ హయాంలో 2007లో అప్ప‌టి ప్ర‌భుత్వం ఇచ్చిన అవ‌కాశం మేర‌కు 14 మంది షాపులు కొనుక్కున్నారు. ఇంకా 287 షాపుల‌ హౌజింగ్ బోర్డు ఆధీనంలోనే ఉన్నాయి. వీటిలో 62 షాపులు ప్ర‌స్తుతం ఖాళీగానే ఉన్నాయ‌. హౌజింగ్ బోర్డు నిబంధ‌న‌ల ప్ర‌కారం ప్ర‌తీ షాపు య‌జ‌మాని ప్ర‌తి ఏటా 10% అద్దెను పెంచాల్సి ఉంటుంది. ఆ మేరకు షాపును రెన్యువ‌ల్ చేసుకోవాలి. కానీ ఈ నిబంధ‌న అమ‌లు కావడంలేదు. షాపు య‌జ‌మానుల నుంచి హౌజింగ్ బోర్డుకు కోట్లాది రూపాయిలు బకాయిలున్నాయని మంత్రికి అధికారులు వివరించారు. హౌజింగ్ బోర్డు భూముల లీజు, అగ్రిమెంట్లు, కోర్టు కేసులు, అద్దెలు త‌ద‌త‌ర అంశాల‌పై సచివాలయంలో రివ్యూ సందర్భంగా అధికారులకు మంత్రి పై ఆదేశాలు ఇచ్చారు.

భూములు అన్యాక్రాంతం కావొద్దు :

హౌజింగ్ బోర్డుకు చెందిన భూముల ప‌రిర‌క్ష‌ణ‌కు చ‌ర్య‌లు తీసుకుంటూనే లీజు, క‌మ‌ర్షియ‌ల్, అద్దెలు, రెగ్యుల‌రైజేష‌న్ త‌దిత‌ర అంశాల‌పై కార్యాచ‌ర‌ణ ప్ర‌ణాళిక రూపొందించాల‌ని అధికారుల‌ను మంత్రి ఆదేశించారు. ఈ భూముల ప‌రిర‌క్ష‌ణ‌కు ప‌టిష్ట‌మైన చ‌ర్య‌లు తీసుకోవాల‌న్నారు. అంగుళం భూమి కూడా అన్యాక్రాంతం (Encroachment) కావడానికి వీల్లేద‌ని నొక్కిచెప్పారు. భూములకు సంబంధించిన కోర్టు కేసుల్లో బలమైన వాదనలు వినిపించి ఆ భూములు హౌజింగ్ బోర్డుకే దక్కేలా ప్రత్యేకంగా ఒక అడ్వ‌కేట్‌ను నియ‌మించుకోవాల‌ని సూచించారు. నిజాం కాలం నుంచి 115 సంస్ధ‌ల‌కు హౌసింగ్ బోర్డు భూముల‌ను లీజుకు (Lease) ఇచ్చిందని, ఇందులో ఎక్కువగా స్కూళ్ళు, ఇన్‌స్టిట్యూష‌న్స్‌, దేవాలయాలు, రెసిడెన్షియ‌ల్ – క‌మ‌ర్షియ‌ల్‌ కాంప్లెక్సులు ఉన్నాయ‌ని అధికారులు తెలిపారు. ఏడు స్ధ‌లాల‌ కోర్టు కేసుల్లో ఉన్నాయని, కొన్ని షాపులకు అద్దె బ‌కాయిలు కూడా ఉన్నాయ‌ని అధికారులు వివ‌రించారు.

వంద గజాల స్థలాలు సేల్స్ కోసం :

హౌజింగ్ బోర్డు(Housing Board) గ‌తంలో కేటాయించిన ఇండ్ల‌కు ప‌క్క‌నే ఉన్న వంద గ‌జాల లోపు స్ధలాల‌ను ఆ ఇంటి య‌జ‌మానికి ఆస‌క్తి ఉంటే కొనుక్కునేలా ఎంకరేజ్ చేయాలని మంత్రి సూచించారు. గ‌తంలో ఇంటి కోసం హౌజింగ్ బోర్డు కేటాయించిన స్ధ‌లాన్ని రిజిస్ట్రేష‌న్ చేసుకోనివారికి ఇప్పుడు రిజిస్ట్రేష‌న్ (Registration) అవ‌కాశం క‌ల్పించాల‌న్నారు. దీనితో పాటే ప‌క్క‌నే ఉన్న వంద గ‌జాల లోపు స్ధ‌లాన్ని కూడా కొనుగోలు చేసుకుంటే మొత్తం స్ధ‌లానికి ఒకేసారి రిజిస్ట్రేష‌న్ చేయించుకునే అవ‌కాశం క‌ల్పించాల‌ని సూచించారు. మార్కెట్ ధ‌ర‌, స‌బ్ రిజిస్ట్రార్ మార్కెట్ కార్డు విలువ వంద గ‌జాల లోపు స్ధ‌లాల వివ‌రాలు, రిజిస్ట్రేష‌న్ కాని ప్లాట్ల వివ‌రాలపై మంత్రి ఆరా తీశారు. ఈ అంశాల‌పై పూర్తిస్ధాయి నివేదిక త‌యారుచేయాల‌ని అధికారుల‌కు సూచించారు. తదుపరి క్యాబినెట్‌ భేటీలో చ‌ర్చించి తుది నిర్ణ‌యం తీసుకుంటామ‌ని మంత్రి తెలిపారు.

Read Also: ‘ఉపాధి హామీ’ ఆత్మను చంపేసే కుట్ర

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>