Mobile Popup Ad
Mobile Popup Ad

యువతకు ఉపాధి హామీ.. హనుమకొండలో రేపే ఉద్యోగ మేళా

కలం, వరంగల్ బ్యూరో: హనుమకొండలో శుక్రవారం నిర్వహించనున్న మెగా జాబ్ మేళాను నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని మంత్రి కొండా సురేఖ (Konda Surekha) తెలిపారు. గురువారం హనుమకొండ (Hanamkonda) జిల్లా కలెక్టరేట్‌లో వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య, ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి, కె.ఆర్. నాగరాజులతో కలిసి మెగా జాబ్ మేళా పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందని తెలిపారు. చదువుకు తగిన ఉద్యోగ అవకాశాలు యువతకు అందేలా మెగా జాబ్ మేళాలు దోహదపడతాయని పేర్కొన్నారు.

హనుమకొండలోని కాళోజీ కళాక్షేత్రంలో నిర్వహించనున్న ఈ మెగా జాబ్ మేళాలో వివిధ రంగాలకు చెందిన ప్రముఖ కంపెనీలు పాల్గొంటున్నాయని తెలిపారు. ఇంటర్మీడియట్, డిప్లొమా, డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన యువత ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. మ్యానుఫ్యాక్చరింగ్, డిజిటల్ మీడియా, హెల్త్ కేర్, బిజినెస్ సర్వీసెస్, లాజిస్టిక్స్, బ్యాంకింగ్, ఫైనాన్స్, ఐటీ, కస్టమర్ కేర్, హాస్పిటాలిటీ తదితర రంగాల్లో ఉద్యోగ అవకాశాలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు విద్యార్హతలు, ఇతర ధ్రువపత్రాలతో మెగా జాబ్ మేళాకు హాజరుకావాలని మంత్రి కోరారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>