Mobile Popup Ad
Mobile Popup Ad

విజయ్‌కు షాక్.. తమిళనాడు కొత్త సీఎంగా పళనిస్వామి?

కలం, వెబ్ డెస్క్: తమిళనాడులో పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఓ వైపు విజయ్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారంటూ ఏర్పాట్లు జరుగుతుంటే, మరోవైపు డీఎంకే (DMK), అన్నాడీఎంకే (AIADMK) కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నారనే వార్తలు సంచలనం కలిగిస్తున్నాయి. రెండు ద్రవిడ పార్టీల ఉనికి కాపాడుకోవడంతో పాటు విజయ్‌ని సీఎం కాకుండా అడ్డుకునేందుకే ఎత్తులు వేశాయా.. అనే చర్చ జరుగుతోంది. గవర్నర్ సైతం అతి పెద్ద పార్టీ టీవీకేకు ప్రభుత్వం ఏర్పాటు చేయకుండా నిరాకరించడంలో ఇదేనా వ్యూహం.. అనే విశ్లేషణలు వస్తున్నాయి. ఒకవేళ రెండు పార్టీలు కలిసి కూటమిగా ఏర్పడితే.. సీఎంగా ఏఐడీఎంకే అధినేత పళనిస్వామి (Palaniswami) అవుతారనే ఊహాగానాలు కూడా చెన్నై వర్గాల్లో వినిపిస్తున్నాయి.

ఇద్దరు కలిస్తే.. సులువుగానే ప్రభుత్వం ఏర్పాటు

డీఎంకే 59 సీట్లు, అన్నా డీఎంకే 47 సీట్లు గెలుపొందాయి. ఈ రెండు పార్టీలతో పాటు మిత్రపక్షాలు కూడా కలిస్తే 120 మందికి పైగా ఎమ్మెల్యేల బలం ఉంది. ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన ఎమ్మెల్యే సంఖ్య 118 కంటే రెండు సీట్లు ఎక్కువగానే ఉంటాయి. దీంతో కాంగ్రెస్, బీజేపీ మద్దతు లేకుండానే ప్రభుత్వం ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ మేరకు ఇరు పార్టీల నేతలు ఇప్పటికే సీఎం విషయంలో ఓ అంగీకారానికి కూడా వచ్చినట్లు కథనాలు వెలువడుతున్నాయి. రెండున్నరేళ్లు పళనిస్వామి (Palaniswami), మరో రెండున్నరేళ్లు ఉదయనిధి స్టాలిన్ ముఖ్యమంత్రిగా ఉండేలా ఒప్పందం కుదిరే అవకాశం ఉంని చెబుతున్నారు. దీంతో, ఎవరు సీఎం అవబోతున్నారనేది అత్యంత ఆసక్తికరంగా మారింది. బద్ధ శత్రువుల్లాంటి ఈ రెండు పార్టీలు నిజంగానే కలుస్తాయా.. అనే మరో చర్చ కూడా జరుగుతోంది.

Read Also: నాడు చంద్రబాబును నిలదీసిన రైతు.. నేడు కేటీఆర్ పలకరింపు

Follow Us On: WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>