Mobile Popup Ad
Mobile Popup Ad

నేడు సిద్దిపేటకు టీఆర్ఎస్‌ చీఫ్ కవిత

కలం, మెదక్ బ్యూరో :  నేడు సిద్దిపేట (Siddipet) జిల్లాలో తెలంగాణ రక్షణ సేన పార్టీ అధ్యక్షురాలు కవిత (TRS Chief Kavitha) పర్యటించనున్నారు. పార్టీ స్థాపన అనంతరం తెలంగాణలో ఆమె చేపడుతున్న తొలి పర్యటన కావడంతో రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. ఈరోజు సాయంత్రం 4 గంటలకు మిరుదొడ్డి మండలం మోతె గ్రామంలోని శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర స్వామి ఆలయాన్ని ఆమె సందర్శించనున్నారు. అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించి, అనంతరం స్థానిక నాయకులు, కార్యకర్తలతో సమావేశమయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. కవిత రాకతో గ్రామంలో ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. తెలంగాణ రక్షణ సేన పార్టీ ప్రకటన తర్వాత ప్రజలలోకి వెళ్లే కార్యక్రమాలను ప్రారంభించిన కవిత, సిద్ధిపేట జిల్లానే తన తొలి పర్యటనకు ఎంచుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>