Mobile Popup Ad
Mobile Popup Ad

జహీరాబాద్‌ రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం

కలం, మెదక్ బ్యూరో: సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ (Zaheerabad) బైపాస్ రోడ్‌లో రోడ్డు ప్రమాదం జరిగింది. ముంబై జాతీయ రహదారి బైపాస్ రోడ్డుపై ఆగి ఉన్న వాహనాన్ని వెనుక నుంచి కారు ఢీ కొట్టింది. ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందగా, మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. మృతులు రంగారెడ్డి చేవెళ్ల కు చెందిన మైలాపూర్ రోహిత్ (16), కాసుల మహేష్ గౌడ్ (26) గా పోలీసులు గుర్తించారు. తుల్జాపూర్‌కు వెళ్లి వస్తుండగా ప్రమాదం జరిగింది. క్షతగాత్రులను జహీరాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>