కలం, వెబ్‌డెస్క్: పార్లమెంటు(Parliament)లో విపక్షాలు ఆందోళనలు, నిరసనలు నిర్వహించడం సహజమే. అధికారంలో ఉన్న పార్టీ విధానాలను విపక్షాలు వ్యతిరేకిస్తూ ఉంటాయి. అయితే ఇప్పుడు అధికారంలో ఉన్న బీజేపీ (BJP) నేతలు కాంగ్రెస్ తీరుపై నిరసన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అగ్రనేతలు క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్ చేశారు. ఢిల్లీలో ఆదివారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ నిరసన చేపట్టిన విషయం తెలిసిందే. దేశంలో ఓట్ చోరీ జరుగుతోందని.. బీహార్‌లో లక్షల సంఖ్యలో ఓట్లను తొలగించి ఓట్ చోరీకి పాల్పడ్డారని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు.
దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి కాంగ్రెస్ కార్యకర్తలు భారీ సంఖ్యలో ఈ నిరసనకు హాజరయ్యారు. లక్షల మంది నిరసనల్లో పాల్గొన్నారని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. అయితే ఈ నిరసన ర్యాలీలో ప్రధాని మోడీ మీద చేసిన ఆరోపణలను బీజేపీ తీవ్రంగా ఖండించింది. ప్రధాని మోడీని సమాధి చేయాలని ఆ ర్యాలీలో కొందరు నేతలు విమర్శించారని బీజేపీ ఆరోపిస్తోంది. ప్రధాని మోడీపై ఇటువంటి ఆరోపణలు చేయడం తగదని బీజేపీ అంటోంది.
కాంగ్రెస్ అగ్రనేతలు వెంటనే క్షమాపణ చెప్పాలని బీజేపీ (BJP) నేతలు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ నేతలు మాత్రం తాము అలా అనలేదని అంటున్నారు. ఖర్గే(Kharge), సోనియా, రాహుల్(Rahul Gandhi) ఎక్కడా కూడా అటువంటి వ్యాఖ్యలు చేయలేదని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ పేర్కొన్నారు. మొత్తంగా ఓట్ చోరీ అంశం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ పార్టీ ప్రతి రాష్ట్రంలోనూ ఇటువంటి డిమాండ్‌నే తెరమీదకు తీసుకొస్తున్నది.
ఈ అంశంపై పార్లమెంటు(Parliament)లో తీవ్ర గందరగోళం నెలకొన్నది. కాంగ్రెస్ పార్టీ దేశ రాజకీయాలను తీవ్రంగా దిగజారుస్తోందంటూ బీజేపీ నేతలు ఆరోపించారు. కాగా బీజేపీ ఆరోపణలపై ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ స్పందించారు. ‘కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ అనుచిత వ్యాఖ్యలు చేయదు. మేం ఎంతో విజయవతంగా ర్యాలీ నిర్వహించాం. లక్షల మంది హాజరయ్యారు. మేం అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పకుండా బీజేపీ ఎదురుదాడికి దిగుతోంది.’ అంటూ కేసీ వేణుగోపాల్ పేర్కొన్నారు.
Read Also: నేను ఫామ్ కోల్పోలేదు: సూర్యకుమార్
Follow Us On: Youtube


