Mobile Popup Ad
Mobile Popup Ad

శ్రీకాళహస్తిలో రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి

కలం, వెబ్​ డెస్క్​ : తిరుపతి జిల్లాలో తెల్లవారుజామున విషాదం చోటుచేసుకుంది. శ్రీకాళహస్తి (Srikalahasti) పట్టణ సమీపంలోని ఊరందురు హైవేపై జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. అతివేగంగా దూసుకొచ్చిన అంబులెన్స్, రహదారి పక్కన నిలిపి ఉంచిన లారీని బలంగా ఢీకొట్టడంతో ఈ ప్రమాదం సంభవించింది. ప్రమాద సమయంలో అంబులెన్స్‌లో మొత్తం ఆరుగురు వ్యక్తులు ఉండగా, వారిలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. తీవ్రంగా గాయపడిన మరో ఇద్దరిని వెంటనే స్థానిక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>