కలం, వెబ్ డెస్క్ : తెలంగాణలో రెండవ విడత పంచాయతీ ఎన్నికలు (Sarpanch Elections) ప్రశాంతంగా ముగిశాయి. మధ్యాహ్నం ఒంటిగంట వరకు పోలింగ్ జరగగా.. 2 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభించిన అధికారులు ఫలితాలను వెలువరించారు. ఈ క్రమంలో సంగారెడ్డి జిల్లా పిపడ్‌పల్లి పంచాయతీ ఎన్నికల్లో అనూహ్య ఫలితం చోటు చేసుకుంది. మరణించిన సర్పంచ్ అభ్యర్థికి గ్రామస్తులు పట్టం కట్టారు. గ్రామ సర్పంచ్ అభ్యర్థి చాల్కి రాజు (35) (Chalky Raju) కాంగ్రెస్ పార్టీ మద్ధతుతో నామినేషన్ దాఖలు చేశారు.
అయితే, ఎన్నికల (Sarpanch Elections) ప్రచారానికి డబ్బులు లేకపోవడం.. పోటీకి ప్రోత్సహించిన వారు సహకరించకపోవడంతో రాజు ఈనెల 8వ తేదీన ఆత్మహత్య చేసుకున్నాడు. అయ్యప్ప మాలదీక్షలో ఉండగానే ఆయన ఊరేసుకుని బలవన్మరణాని పాల్పడడం అందరినీ కలిచి వేసింది. ఆదివారం జరిగిన పోలింగ్ లో 8 ఓట్ల తేడాతో ప్రత్యర్థిపై విజయం సాధించాడు. దీంతో అధికారులు మరోసారి ఆ గ్రామంలో ఎన్నికలు నిర్వహించడానికి నిర్ణయం తీసుకున్నారు.
Read Also: బీజేపీ యంగెస్ట్ ప్రెసిడెంట్గా నితిన్ నబీన్?
Follow Us On: Youtube


