కలం, వెబ్ డెస్క్ : కవిత(Kavitha).. కేసీఆర్ కూతురు కాబట్టి లీడరయ్యింది.. కానీ, తాను వ్యక్తిగతంగా ఎదిగానని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి(Jagga Reddy) తెలిపారు. ఆదివారం హైదరాబాద్ గాంధీ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ ను వీడడానికి కారణం హరీశ్ రావు అని కవిత చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. కవిత ఇప్పటికైనా ఇలాంటి ప్రచారాలు చేయడం మానుకోవాలని హితవు పలికారు. హరీశ్ రావుది వెనక నుంచి పొడిచే రాజకీయం అని విమర్శించారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో హరీశ్ రావు తాను ఎప్పుడూ కొట్లాడుతూనే ఉంటామన్నారు.
హరీశ్ రావు(Harish Rao) మీద కోపంతో కాంగ్రెస్ పార్టీలోకి రాలేదని స్పష్టం చేశారు. పార్టీలోకి రావడానికి వైఎస్సార్(YSR) కారణమని స్పష్టం చేశారు. తాను కొంత డిస్ట్రబ్ అయ్యానని.. టైం వచ్చినప్పుడు అన్నీ చెబుతానని జగ్గారెడ్డి(Jagga Reddy) అన్నారు. ముఖ్యమంత్రి అవుతానని ఎవరైనా అంటే సిగ్గుగా ఉందని చెప్పారు. ప్రచార కమిటీ చైర్మన్ పదవి మీద కూడా ఆసక్తిగా లేదని జగ్గారెడ్డి వెల్లడించారు.
Read Also: మల్లయ్య కుటుంబానికి కేటీఆర్ కీలక హామీ
Follow Us On: Youtube


