కలం, వెబ్డెస్క్: ఓట్ చోరీ కేవలం కాంగ్రెస్ పార్టీ సమస్య కాదని, ప్రజలందరి సమస్య అని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) అన్నారు. ఆదివారం ఢిల్లీలోని రామ్లీలా మైదానంలో జరిగిన ‘ఓట్చోరీ మహాధర్నా’ కార్యక్రమంలో ఆయన పాల్గొని, మాట్లాడారు. ఓటు అనేది అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా భారతీయులందరికీ కల్పించిన హక్కు అని రేవంత్ అన్నారు. ఇప్పుడా హక్కును ప్రజల నుంచి, ముఖ్యంగా పేదల నుంచి దూరం చేయడానికి బీజేపీ ప్రయత్నిస్తోందని విమర్శించారు. ఓటు హక్కు కోల్పోతే ఆధార్, రేషన్ కార్డు, భూమి అన్నీ కోల్పోతామని హెచ్చరించారు.
ఈ దేశం మూలవాసులైన ఆదివాసీల ఓటునూ తొలగించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. దళితులు, ఆదివాసీ, పేదలకు ఓటు హక్కు ఇవ్వడాన్ని ఆర్ఎస్ఎస్ వ్యతిరేకించిందని గుర్తుచేశారు. ‘గత ఎన్నికల్లో 400 సీట్లు రాకపోవడంతో ‘సర్’ పేరుతో ఓట్ చోరీ(Vote Chori)కి బీజేపీ తెరతీసింది. దళిత, మైనారిటీ, ఆదివాసీల ఓట్లు తొలగించేందుకు కుట్ర చేస్తోంది. రాజ్యాంగం మార్చేందుకు ప్రయత్నిస్తోంది. దీనిపై కాంగ్రెస్ పార్టీ పోరాడుతోంది. రాహుల్ గాంధీ(Rahul Gandhi) అలుపెరగని సైనికులా పోరాటం చేస్తున్నారు. ఈ పోరాటంలో రాహుల్ గాంధీకి మనం అందరంగా అండగా ఉండాలి.’ అని రేవంత్ రెడ్డి(Revanth Reddy) పిలుపునిచ్చారు.
Read Also: మోదీ ప్రభుత్వాన్ని దేశం నుంచి తొలగిస్తాం : రాహుల్ గాంధీ
Follow Us On: Youtube


