కలం డెస్క్ : బీజేపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నితిన్ నబిన్ (Nitin Nabin)ను నియమిస్తూ కార్యదర్శి అరుణ్ సింగ్ ప్రకటించారు. తక్షణం ఈ ఉత్తర్వులు అమలులోకి వస్తాయని పేర్కొన్నారు. ప్రస్తుతం బిహార్ మంత్రిగా కొనసాగుతున్న నితిన్ నబిన్ వెంటనే రాజీనామా చేసి పార్టీ వ్యవహారాల బాధ్యతను చేపట్టనున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడి ఎంపిక కోసం తీవ్ర స్థాయిలో కసరత్తు జరుగుతున్న సమయంలో నితిన్ పేరును ప్రస్తావించి వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఎంపిక చేయడం గమనార్హం.
ఉత్తరప్రదేశ్ బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్‌గా కేంద్ర సహాయ మంత్రి పంకజ్ చౌదరి నామినేషన్ దాఖలు చేయడం, ఆయన ఎన్నిక ఏకగ్రీవం అయిన కొన్ని గంటల వ్యవధిలోనే జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ విషయంలో బిహార్ మంత్రి నితిన్ నబిన్ (Nitin Nabin)ను నియమిస్తూ పార్టీ ప్రధాన కార్యాలయం నుంచి ప్రకటన వెలువడడం ప్రాధాన్యతను సంతరించుకున్నది. పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ధర్మేంద్ర ప్రధాన్‌ను నియమించవచ్చని ఊహాగానాలు వస్తున్న సమయంలో పార్టీలో సంస్థాగత మార్పులు అనూహ్యంగా చోటుచేసుకుంటున్నాయి.
Read Also: విశ్వనగరంలో మంచినీటి కొరత దౌర్భాగ్యం: కవిత
Follow Us On: X(Twitter)


