కలం, వెబ్ డెస్క్: టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav)పై మాజీ ప్లేయర్ ఆకాష్ చోప్రా (Aakash Chopra) ఘాటు వ్యాక్యలు చేశారు. కెప్టెన్ అంటే టాస్ వేయడం, బౌలర్లకు ఉచిత సలహాలు ఇవ్వడం మాత్రమే కాదని చురకలంటించారు. కెప్టెన్ అంటే జట్టు బాధ్యతలను మోయడంతో పాటు జట్టును ముందుండి నడిపించాలని అన్నారు. టీ20ల్లో ఒకప్పుడు విధ్వంసక బ్యాటర్‌గా పేరు తెచ్చుకున్న సూర్యకుమార్ యాదవ్ ఇప్పుడు ఫామ్ సంక్షోభంలో ఉన్నారు.
భారత టీ20 జట్టు కెప్టెన్‌గా ఉన్నప్పటికీ, గత 20 ఇన్నింగ్స్‌లుగా ఒక్క అర్ధశతకం కూడా చేయలేకపోవడం తీవ్ర చర్చకు దారితీసింది. గత ఏడాది నవంబర్ నుంచి ఇప్పటి వరకు కేవలం 227 పరుగులే చేసి 13.35 సగటుతో కొనసాగుతున్నారు. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న టీ20 సిరీస్‌లోనూ తొలి రెండు మ్యాచ్‌ల్లో 12, 5 పరుగులకే ఔటవ్వడం విమర్శలకు కారణమైంది.
ఈ నేపథ్యంలో మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా (Aakash Chopra) స్పందిస్తూ…కెప్టెన్ పని కేవలం వ్యూహాలు రచించడం మాత్రమే కాదని, టాప్ ఆర్డర్ బ్యాటర్‌గా పరుగులు చేయడమే ప్రధాన బాధ్యత అని అన్నారు. సూర్య నాయకత్వంపై తనకు ఎలాంటి సందేహాలు లేవని స్పష్టం చేసినప్పటికీ, వరల్డ్‌కప్‌ను దృష్టిలో పెట్టుకుని అతడు తప్పనిసరిగా ఫామ్‌లోకి రావాల్సిన అవసరం ఉందన్నారు. కెప్టెన్‌గా సూర్య, వైస్ కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్ బ్యాట్‌తో జట్టును ముందుండి నడిపితేనే భారత జట్టుకు లాభమని ఆకాష్ చోప్రా అభిప్రాయపడ్డారు.
Read Also: మా పిల్లలని యూట్యూబ్ చూడనివ్వము – యూట్యూబ్ సీఈఓ
Follow Us On: Youtube


