కలం, వెబ్ డెస్క్ : గుంటూరు (Guntur Drugs Case)లో దారుణం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణానికి చెందిన ఓ బాలిక స్థానిక ప్రైవేట్ జూనియర్ కాలేజీలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతోంది. అదే కాలేజీకి చెందిన సీనియర్ అబ్బాయి ఇన్ స్టాగ్రామ్ ద్వారా బాలికకు పరిచయం అయ్యాడు. ఇద్దరి మధ్య ఫ్రెండ్షిప్ పెరిగాక ప్రేమిస్తున్నా అంటూ బాలికను నమ్మించాడు. బాలికకు డ్రగ్స్ (Guntur Drugs Case) అలవాటు చేసి అసభ్యకరంగా ఆమె వీడియోలు తీశాడు ప్రియుడు. బాలిక కదలికల మీద అనుమానం వచ్చిన ఆమె తల్లి.. కూతురి ఫోన్ తీసుకుని చూడగా అసభ్యకర వీడియోలు కనిపించాయి. వాటిపై ప్రశ్నిస్తే తల్లిపైనే దాడి చేసింది బాలిక. మనస్థాపంతో తల్లి నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ ఘటనపై డ్రగ్స్ కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు.
Read Also: ఫ్లైట్ లో మహిళకు గుండెపోటు.. కాపాడిన మాజీ ఎమ్మెల్యే
Follow Us On: Youtube


