కలం, వెబ్ డెస్క్: సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో వనపర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే మేఘారెడ్డి (MLA Megha Reddy) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ మద్దతుదారులను గెలిపించొద్దని ప్రజలకు వార్నింగ్ ఇచ్చారు. బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపిస్తే .. వారికి తాను ఏ పనులు చేసిపెట్టనని.. తన క్యాంప్ ఆఫీస్ గేటు కూడా దాటనివ్వనని హెచ్చరించారు.
మహబూబ్‌నగర్ జిల్లా అడ్డాకుల మండలంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే మేఘారెడ్డి సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘బీఆర్ఎస్ పార్టీ తరపున ఒక్క వార్డు మెంబర్ గెలిచినా కూడా అభివృద్ధి పనుల కోసం నా దగ్గరికే రావాలి. నేను వారిని రానివ్వను. నా క్యాంప్ ఆఫీసు గేటు కూడా తాకనివ్వను. మెడపట్టి బయటకు గెంటేస్తా’ అంటూ మేఘారెడ్డి (Megha Reddy) వ్యాఖ్యానించారు.
ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదంగా మారాయి. సర్పంచ్ లు లేదా వార్డు సభ్యులగా గెలిచినవారికి నిధులు ఇవ్వాల్సిందేనని.. ఎమ్మెల్యే వ్యాఖ్యలు చట్ట విరుద్ధంగా ఉన్నాయని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. ఓటర్లను బెదిరించిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని కోరారు.
Read Also: విజన్ సరే… ఇంప్లిమెంటేషన్ ఎలా?
Follow Us On: X(Twitter)


