కలం, వెబ్ డెస్క్ : సౌత్ ఆఫ్రికా(South Africa)లో అహోబిలం ఆలయం కుప్పకూలి నలుగురు మృతి చెందారు. ఈ ఘటన కలకలం రేపుతోంది. క్వాజులు నాటల్ ప్రావిన్స్ లో నిర్మిస్తున్న నాలుగు అంతస్తుల అహోబిలం ఆలయం కూలిపోయింది. ఈ ఘటనలో భారత సంతతికి చెందిన వ్యక్తితో పాటు మరో ముగ్గురు చనిపోయారు. ఆలయం నిర్మాణ పనులు జరుగుతుండగానే కూలిపోయినట్టు అధికారులు తెలిపారు. ఘటన జరిగినప్పుడు కార్మికులు, కొందరు అధికారులు అక్కడే ఉన్నట్టు తెలుస్తోంది. ఆలయ శిథిలాల కింద మరింత మంది ఉండొచ్చని అంటున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని.. శిథిలాలు భారీ ఎత్తున ఉండటంతో తొలగించేందుకు టైమ్ పడుతున్నట్టు తెలిపారు అధికారులు. భారత సంతతికి చెందిన వ్యక్తి విక్కీ జైరాజ్ పాండేగా గుర్తించారు. ఇతను ఆలయ ట్రస్ట్ ఎగ్జిక్యూటివ్ సభ్యుడిగా ఉన్నాడు. ఆలయ నిర్మాణ మేనేజర్ గా వ్యవహరిస్తున్నాడు.
Read Also: గుడివాడలో భారీ అగ్ని ప్రమాదం
Follow Us On: Instagram


