మందలించిందని కన్న తల్లినే హతమార్చాడో వ్యక్తి. ఈ ఘటన వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరు(Proddatur)లో చోటుచేసుకుంది. శ్రీరామ్ నగర్లో ఆదివారం ఉదయం జరిగిన ఈ ఘటన కలకలం రేపింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. నిందితుడు యశ్వంత్ రెడ్డి ప్రస్తుతం ఉద్యోగం కోసం వెతుకులాటలో ఉన్నాడు. ఎన్ని ప్రయత్నాలు చేసిన ఉద్యోగం దొరకడం లేదు. అతడి తల్లి లక్ష్మీదేవి.. ఈశ్వర్ రెడ్డి నగర్‌లోని ఓ ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు. ఆదివారం ఉదయం లక్ష్మీదేవి.. వంటింట్లో వంటచేస్తున్న సమయంలో యశ్వంత్‌తో గొడవ జరిగింది.
Proddatur | ఏదో విషయంలో వీరు గొడవపడ్డాడు. తీవ్ర ఆగ్రహానికి గురైన యశ్వంత్ రెడ్డి.. తండ్రిని ఓ గదిలో బంధించాడు. అనంతరం తల్లిని గొంతుకోసి హతమార్చాడు. అనంతరం రక్తం మడుగులో పడి ఉన్న తల్లిని ఈడ్చుకుంటూ వెళ్లి ఇంటి బయట పడేశాడు. స్థానికులు సమాచారం ఇవ్వడంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నిందితుడు యశ్వంత్ రెడ్డి అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. అసలు ఏం జరిగింది? ఏ విషయంలో తల్లి, కొడుకు మధ్య గొడవరేగింది? అన్న అంశాలపై దర్యాప్తు చేస్తున్నారు.

