కలం, వెబ్ డెస్క్ : ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ప్రస్తుత కాలంలో అన్ని రంగాల్లో కీలకంగా మారుతోంది. దీన్ని వినియోగించే దేశాల సంఖ్య కూడా భారీగా ఉంది. ఈ రంగంలో భారత్ ఒక కొత్త యుద్ధభూమిలా మారింది. భారతదేశంలో AI వినియోగం ఎంత ఎక్కువ అంటే అమెరికా కంటే రెండింతలు ఎక్కువ మంది భారతీయులు AI టూల్స్‌ను ఉపయోగిస్తున్నారు. ఓపెన్‌ఐ (OpenAI), గూగుల్ జెమిని (Google Gemini), పెర్‌ప్లెక్సిటీ (Perplexity) కంపెనీలు గట్టి పోటీ పడుతున్నాయి. వంటి సంస్థలు భారత వినియోగదారుల కోసం ఒక విధంగా పోటీ పడుతున్నాయి అనే చెప్పాలి. వీరిని వినియోగించుకుని తమ ఏఐ మోడల్స్‌ను ట్రైన్ చేసుకోవాలని ప్లాన్ చేస్తున్నాయి. అందులో భాగంగానే భారతదేశంలో ఈ సంస్థలు ఉచిత ఏఐ ప్లాన్లను అందిస్తున్నాయి. భవిష్యత్తు AI మోడళ్ల కోసం బహుభాషా ట్రైనింగ్ డేటాను సేకరించడానికి ఇలా ప్రయత్నిస్తున్నాయి.
7.3 కోట్ల స్మార్ట్‌ఫోన్ వినియోగదారులతో ప్రపంచంలో రెండవ అతిపెద్ద మార్కెట్ భారతదేశం. సగటున, ఒక భారతీయ వినియోగదారు నెలకు 21 GB డేటాను ఉపయోగిస్తారు. అందుకోసం అతడు చాలా తక్కువ మొత్తంలో ఖర్చు చేస్తాడు. ప్రపంచంలో అత్యల్ప మొబైల్ డేటా రేట్లలో ఇండియాలో ఉన్నది ఒకటి.
భారత మార్కెట్‌లో AI ఉచిత ప్లాన్స్:
వినియోగదారులను ఆకర్షించడానికి, Google Reliance Jio వినియోగదారులకు 400 డాలర్ల విలువైన Gemini AI Pro సబ్‌స్క్రిప్షన్‌ను 18 నెలల పాటు ఉచితంగా అందిస్తోంది. జియో 5 కోట్ల కస్టమర్లకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంది. అదేవిధంగా, Google “AI Plus” భారీ డిస్కౌంట్ ప్యాకేజీని భారత్ సహా అనేక దేశాల్లో ప్రవేశపెట్టింది.
ఓపెన్‌ఐ కూడా చాట్ జీపీటీ గో (ChatGPT Go) ప్లాన్‌ను భారతదేశంలో ఒక సంవత్సరం ఉచితంగా అందిస్తోంది. ఈ ప్లాన్ 100కు పైగా దేశాల్లో కొంత ఛార్జ్‌తోనే అందించబడుతుంది. నవంబర్‌కు ముందు భారత్‌లో 54 డాలర్లకి అందించబడింది. ఈ ప్లాన్ కూడా కేవలం భారత్‌లో మాత్రమే ఉచితంగా అందుబాటులో ఉంది.
డౌన్లోడ్ డేటా ప్రకారం, ఉచిత ప్లాన్ల కారణంగా ఏఐ వినియోగం భారీగా పెరిగిందని సెన్సార్ టవర్ (Sensor Tower) సంస్థ తెలిపింది. భారత్‌లో చాట్‌జీపీటీ డైలీ యాక్టివ్ యూజర్స్ గత ఏడాదితో పోలిస్తే 607% పెరిగరు. ప్రస్తుతం వారి సంఖ్య 73 మిలియన్లకు చేరింది. ఇది అమెరికా కంటే రెండింతలు ఎక్కువ. Gemini డైలీ యూజర్స్ రిలయన్స్ జియో (Reliance Jio) ఆఫర్ ప్రారంభం నుండి 15% పెరిగి 17 మిలియన్లకు చేరింది. అమెరికాలో కేవలం 3 మిలియన్లు ఉన్నాయి. Perplexity, Airtel వినియోగదారులకు Pro టూల్‌ను ఉచితంగా అందిస్తూ, భారతదేశాన్ని గ్లోబల్ డైలీ యాక్టివ్ యూజర్స్‌లో 7శాతానికిపైగా పెంచింది.
ఉచిత AI ప్లాన్స్ వెనుక రహస్యం:
OpenAI భారతదేశ ఎగ్జిక్యూటివ్ ప్రగ్యా మిశ్రా ప్రకారం, ChatGPT Go ఉచితంగా అందించడం అనేది “భారత్-ఫస్ట్” కట్టుబాటులో భాగం. AI విశ్లేషకులు, ఉచిత ప్లాన్ల వ్యూహం భారతీయ భాషా వైవిధ్యాన్ని ఉపయోగించి, AI ట్రైనింగ్ కోసం కీలకమైన డేటాను సేకరించడంలో ఈ ప్లాన్ సహాయపడుతుందని ప్రగ్యా పేర్కొన్నారు. ఈ డేటా బహుభాషా, స్థానిక ఉపభాషలతో ఉంటుంది. ఇది AI మోడళ్లకు సంక్లిష్ట కమ్యూనికేషన్ నమూనాలను నేర్పించడానికి అవసరమని తెలిపారు.
భారతదేశంలో ఉచిత ఆఫర్లు ముందే పని చేస్తాయని చారిత్రక ఉదాహరణలు ఉన్నాయి. Reliance, Gemini తో భాగస్వామ్యం చేసి, 2016లో నెలల పాటు ఉచిత డేటా, వాయిస్ సేవలతో వినియోగదారులను ఆకర్షించింది. Disneyతో భాగస్వామ్యంతో క్రికెట్ స్ట్రీమింగ్‌ను ఉచితంగా అందించడం కూడా వినియోగాన్ని పెంచింది.
సెన్సార్ టవర్ డేటా ప్రకారం, ChatGPT భారతదేశంలో అత్యధిక యాప్ వినియోగాన్ని చూపిస్తోంది – 46% మాసిక వినియోగదారులు ప్రతిరోజూ యాప్ తెరవడం జరుగుతోంది, Perplexity 20%, Gemini 14% మాత్రమే. హైదరాబాద్‌లోని PhD విద్యార్థి అనీస్ హసన్, ఉచిత ChatGPT, Gemini ప్లాన్లను రోజుకు మూడు గంటలు సైటేషన్స్, రైటింగ్ మెరుగ్గా చేయడం, ప్రెజెంటేషన్స్ కోసం చిత్రాలు రూపొందించడానికి ఉపయోగిస్తున్నారు.
Read Also: ఈ ఏడాది ‘అలెక్సా’ని ఎక్కువగా అడిగిన ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్
Follow Us On: X(Twitter)


