కలం, వెబ్ డెస్క్ : సమాజ్ వాది పార్టీ అధ్యక్షుడు, యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ (Akhilesh Yadav).. మాజీ మంత్రి కేటీఆర్ (KTR) తో కలిసి హైదరాబాద్ లోని రామేశ్వరం కేఫ్ (Rameswaram Cafe) లో లంచ్ చేశారు. కేఫ్ రుచులను ఆస్వాదిస్తూ ఇద్దరు నేతలు రాజకీయ చర్చలు జరిపారు. అఖిలేశ్ హైదరాబాద్ పర్యటనలో భాగంగా శుక్రవారం కేటీఆర్ నందినగర్ నివాసంలో బీఆర్ఎస్ నేతలు హరీశ్ రావు, తదితరులతో సమావేశం అయ్యారు. శనివారం ఉదయం ఓ కార్యక్రమంలో పాల్గొన్న అఖిలేశ్.. కేటీఆర్ తో కలిసి లంచ్ కోసం రామేశ్వరం కేఫ్ కు వెళ్లారు. అక్కడ ఇద్దరు టిఫిన్ తింటూ రాజకీయ, సమాకాలీన అంశాలపై కాసేపు ముట్టటించారు. అఖిలేశ్, కేటీఆర్ రాక సందర్బంగా రామేశ్వరం కేఫ్ యజమాని వారిద్దరికి ఘనస్వాగతం పలికి ఏర్పాట్లు చేశారు.
దక్షిణాది టిఫిన్స్ కు రామేశ్వరం కేఫ్ పేరొందింది. దీంతో అఖిలేశ్ యాదవ్ ఇక్కడ తినడానికి ఆసక్తి చూపినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కేటీఆర్(KTR), అఖిలేశ్ యాదవ్‌ల లంచ్ మీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో వీరిద్దరి భేటి రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. శనివారం ఉదయం హోటల్ తాజ్ కృష్ణలో సమాజ్ వాది పార్టీ ఆధ్వర్యంలో విజన్ ఇండియా సమ్మిట్ నిర్వహించారు. రాజకీయాలకు అతీతంగా జరిగిన ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు అఖిలేశ్ యాదవ్ హైదరాబాద్ పర్యటనకు వచ్చారు. మొదటి సమావేశం బెంగళూరులో జరగగా రెండో సమ్మిట్ కు హైదరాబాద్ వేదికయ్యింది. సమావేశం ముగిసిన అనతరం కేటీఆర్ అఖిలేశ్ యాదవ్ కలిసి రామేశ్వరం కేఫ్ లో లంచ్ చేశారు. అనంతరం అక్కడి నంచి కేటీఆర్, అఖిలేశ్ యాదవ్ బీఆర్ఎస్ మాజీమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇంటికి వెళ్లారు.
Read Also: ఏఐ టెక్నాలజీతో బీజేపీని ఓడిస్తాం : అఖిలేశ్ యాదవ్
Follow Us On: X(Twitter)


