కలం, వెబ్‌డెస్క్: ఫుట్‌బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీ టూర్ నేపథ్యంలో హైదరాబాద్‌లో భారీగా ట్రాఫిక్ ఆంక్షలు (Hyderabad traffic restrictions) విధించారు. ఉప్పల్ స్టేడియంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మెస్సీ తలపడనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్ంయంలో మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 11.50 గంటల వరకు ఉప్పల్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఈ మేరకు రాచకొండ కమిషనర్ ఆఫ్ పోలీస్ సుధీర్ బాబు ఓ ప్రకటన విడుదల చేశారు. పెద్ద సంఖ్యలో అభిమానులు తరలివచ్చే అవకాశం ఉండటంతో, వాహన రాకపోకలను క్రమబద్ధీకరించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.
మెస్సీ పర్యటన నేపథ్యంలో ఫలక్‌నుమా–ఉప్పల్, సికింద్రాబాద్–ఉప్పల్ మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. (Hyderabad traffic restrictions) వాహనాలను ప్రత్యామ్నాయ మార్గాల వైపు మళ్లించనున్నారు. తార్నాక నుంచి ఉప్పల్ దిశగా వెళ్లే వాహనాలను హబ్సిగూడ క్రాస్‌రోడ్స్ వద్ద నాచారం, చర్లపల్లి వైపు మళ్లిస్తారు. అలాగే రామాంతపూర్ నుంచి ఉప్పల్ వైపు వచ్చే వాహనాలను స్ట్రీట్ నెం.8 వద్ద దారి మళ్లించనున్నట్లు పోలీసులు వెల్లడించారు.
ఉప్పల్ స్టేడియం చుట్టుపక్కల రోడ్లపై వాహనాల రద్దీ పెరిగే అవకాశం ఉన్నందున ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. నగరవాసులు, అభిమానులు ఆర్టీసీ బస్సులు, మెట్రో రైలు వంటి ప్రజా రవాణా సౌకర్యాలను వినియోగించాలని సూచించారు. అలాగే ట్రాఫిక్ పోలీసుల సూచనలను పాటిస్తూ సహకరించాలని, ప్రయాణాలను వీలైనంతవరకు వాయిదా వేసుకోవాలని పోలీసులు కోరారు. మెస్సీ పర్యటనను సురక్షితంగా, శాంతియుతంగా నిర్వహించేందుకు పోలీస్, ట్రాఫిక్ విభాగాలు సమన్వయంతో పనిచేస్తున్నాయని సీపీ సుధీర్ బాబు తెలిపారు.
Read Also: తన భారీ విగ్రహాన్ని ఆవిష్కరించిన మెస్సీ
Follow Us On: Youtube


