కలం, వెబ్‌డెస్క్: అమరావతి రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతుల్లో (Amaravati Farmers) ఆందోళనలు నెలకొన్న విషయం తెలిసిందే. తమకు ఇంకా ప్లాట్లు కేటాయించలేదని.. తమ సమస్యలు పరిష్కరించడం లేదని వారు అహనంగా ఉన్నారు. దీంతో అమరావతి రైతుల పరిష్కారానికి ఏపీ ప్రభుత్వం త్రిమెన్ కమిటీ వేసింది. ఈ కమిటీ శనివారం సమావేశమై పలు అంశాలపై చర్చించింది.
రైతులతో (Amaravati Farmers) త్రీమెన్ కమిటీ చర్చించింది. అనంతరం కేంద్రమంత్రి పెమ్మసాని(Minister Pemmasani) మీడియాకు వివరాలు వెల్లడించారు. రైతులకు సంబంధించిన ప్లాట్ల కేటాయింపుపై చర్చలు జరిపామని ఆయన తెలిపారు. వీధి పోటు ఉన్న ప్లాట్లను మార్చుకోవచ్చని సూచించారు. వచ్చే నెల మొదటి వారంలో భూ సేకరణకు సంబంధించి నోటిఫికేషన్ ఇస్తామని తెలిపారు.
గ్రామ కంఠం భూముల విషయంలో త్వరలో నిర్ణయం తీసుకుంటామన్నారు. రైతులతో మరోసారి చర్చలు జరిపి అన్ని సమస్యలు పరిష్కరిస్తామన్నారు. వచ్చే నెల మొదటి వారంలో భూ సేకరణ విషయంలో ముందుకు వెళ్తామన్నారు. ప్లాట్లు అమ్మి ఉంటే మార్చడం కష్టమని చెప్పారు. లంక భూములపై కోర్టు కేసులు ఉన్నా రిజిస్ట్రేషన్ మొదలు పెట్టామన్నారు.
Read Also: గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు
Follow Us On: Sharechat


