కలం డెస్క్: వరల్డ్ ఫుట్‌బాల్ ప్లేయర్ మెస్సీ (Lionel Messi), తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి (Revanth Reddy) టీమ్‌ల మధ్య ఉప్పల్ స్టేడియంలో జరిగే ఫ్రెండ్లీ మ్యాచ్‌కు క్రేజ్ నెలకొన్నది. సీఎం రేవంత్ ‘సింగరేణి ఆర్ఆర్-9’ తరఫున ఆడుతున్నారు. మెస్సీ టీమ్ పేరు ‘అపర్ణ ఆల్ స్టార్స్’. రాష్ట్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా ఎన్జీవో, ప్రైవేటు సంస్థలు నిర్వహిస్తున్న ఈ గేమ్‌లో సీఎం రేవంత్‌రెడ్డి ఏకంగా ప్రపంచ ప్లేయర్‌తో తలపడడం హాట్ టాపిక్‌గా మారింది. రేవంత్‌రెడ్డి ఆడే టీమ్‌కు ఆర్ఆర్-9 అని పేరు పెట్టడం విశేషం.
రేవంత్‌రెడ్డి పేరును ఆంగ్లంలో షార్ట్ కట్ చేసి RR9 గా ఫిక్స్ చేసింది సింగరేణి సంస్థ. సింగరేణి సంస్థ తరఫున ఆడుతున్నందున ఆ టీమ్ పేరులో సంస్థ పేరును, రేవంత్‌రెడ్డి పేరును చేర్చింది. మెస్సీ టీమ్‌ను అపర్ణ కన్‌స్ట్రక్షన్ సంస్థ స్పాన్సర్ చేస్తున్నందున దానికి ఆ పేరు పెట్టుకున్నది. భారీ పోలీసు భద్రత : మెస్సీ ఆడుతున్న మ్యాచ్ కావడంతో క్రీడాభిమానులు భారీ సంఖ్యలో తరలివస్తారని అంచనా వేసిన రాచకొండ పోలీసులు భారీ స్థాయి పోలీసు భద్రత ఏర్పాటు చేశారు. మరోవైపు సీఎం రేవంత్‌రెడ్డి(Revanth Reddy) స్వయంగా గ్రౌండ్‌లోకి దిగుతుండడంతో ఆయన అభిమానులతో పాటు కాంగ్రెస్ కార్యకర్తలు కూడా ఎక్కువ సంఖ్యలో హాజరు కానున్నారు.
ఫ్రెండ్లీ మ్యాచ్ అయినప్పటికీ టికెట్ ధరను మాత్రం స్పాన్సర్లు భారీగానే ఖరారు చేశారు. అయినా కొనుక్కుని మ్యాచ్ చూడడానికి ఆసక్తి చూపుతున్నారు. స్టేడియానికి దారితీసే పలు మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలతో పాటు వాహనాల పార్కింగ్ విషయంలో ఇబ్బందులు తలెత్తకుండా రాచకొండ పోలీసులు అనేక జాగ్రత్తలు తీసుకున్నారు. సాయంత్రం ఏడు గంటల నుంచి రెండు గంటల పాటు మ్యాచ్ జరగనున్నప్పటికీ మధ్యాహ్నం నుంచే రద్దీ నెలకొనే అవకాశాన్ని అంచనా వేసి ట్రాఫిక్ ఆంక్షలు అమలవుతున్నాయి. వీకెండ్ (సెకండ్ శాటర్‌డే) కావడంతో క్రీడాభిమానులు హెచ్చు సంఖ్యలో వచ్చే అవకాశమున్నది.
Read Also: ఇలాగైతే కష్టమే… ఎమ్మెల్యేలకు పీసీసీ చీఫ్ వార్నింగ్
Follow Us On: Sharechat


