కలం డెస్క్: వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi) మరోసారి తన వైభవం చూపించాడు. 17ఏళ్లుగా ఉన్న రికార్డ్‌ను బ్రేక్ చేశాడు. అండర్–19 ఆసియా కప్ తొలి మ్యాచ్‌లోనే చరిత్ర సృష్టించాడు. యూఏఈపై జరిగిన మ్యాచ్‌లో వైభవ్ 95 బంతుల్లో 171 పరుగులు బాదాడు. 9 ఫోర్లు, 14 సిక్సర్లు సాయంతో ఆడిన ఈ ఇన్నింగ్స్ భారత అండర్–19 జట్టుకు శక్తివంతమైన ఆరంభం అందించింది.
17 ఏళ్ల ప్రపంచ రికార్డు బద్దలు
వైభవ్ సూర్యవంశీ ఒక్క ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన అండర్–19 వన్డే ఆటగాడిగా కొత్త ప్రపంచ రికార్డు నమోదు చేశాడు. 2008లో నమీబియాపై ఆస్ట్రేలియాకు చెందిన మైకేల్ హిల్ 12 సిక్సర్లు కొట్టి నెలకొల్పిన 17 ఏళ్ల రికార్డు ఈ మ్యాచ్‌తో చెరిపేసాడు. యూఏఈ బౌలర్ ఉదిశ్ సూరి బౌలింగ్‌లో ఔటయ్యే వరకు వైభవ్ చెలరేగి 14 సిక్సర్లతో నూతన మైలురాయిని నెలకొల్పాడు.
6 పరుగుల దూరం
అండర్–19 వన్డేల్లో భారత ఆటగాళ్ల అత్యధిక వ్యక్తిగత స్కోర్‌గా అంబటి రాయుడు (177 vs England, 2002) రికార్డు ఇప్పటికీ నిలిచే ఉంది. వైభవ్ కేవలం 6 పరుగుల తేడాతో ఆ రికార్డును అందుకోలేకపోయాడు. కానీ ఆసియా కప్ చరిత్రలో అత్యధిక స్కోర్ చేసిన భారత ఆటగాడిగా వైభవ్ నిలిచాడు. ఇకపోతే, ఇంతకుముందు 121 పరుగులతో ఉన్ముక్త్ చంద్ (2012, vs Pakistan), అర్జున్ ఆజాద్ (2019, vs Pakistan) ఈ జాబితాలో ఉన్నారు.
Read Also: ఓటమికి నాతో పాటు అతడూ బాధ్యుడే: సూర్యకుమార్
Follow Us On: Youtube


