కలం, వెబ్ డెస్క్ : ప్రముఖ సామాజిక వేత్త అన్నా హజారే(Anna Hazare )మరో దీక్ష చేస్తానని ప్రకటించారు. మహారాష్ట్రలోని తన సొంతూరు రాలేగావ్ సిద్ధిలో జనవరి 30న లోకాయుక్త చట్టం(Lokayukta Law)పై నిరాహార దీక్ష చేపడుతున్నట్టు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ చట్టాన్ని అమలు చేయట్లేదని.. ఇచ్చిన హామీలు అమలు చేయట్లేనందున నిరసనగా ఈ నిరాహార దీక్ష చేస్తున్నట్టు అన్నా హజారే (Anna Hazare) వెల్లడించారు. ఇదే తన ఆఖరి నిరాహార దీక్ష అవుతుందని చెప్పారు. ఇదే చట్టంపై అన్నా హజారే 2022లో తన ఊర్లో నిరాహార దీక్ష చేశారు. అప్పటి సీఎం దీన్ని అమలు చేస్తామని హామీ ఇచ్చారు. దానిపై ఓ కమిటీ వేసినా అది అమలుకు నోచుకోలేదు. అందుకే మరోసారి హజారే దీక్షకు దిగుతున్నారు. ఆయన వయసు ప్రస్తుతం 88 ఏళ్లు. ఈ వయసులో అవన్నీ వద్దని ఆయన అభిమానులు కోరుతున్నారు.
Read Also: మెస్సీ మ్యాచ్.. రేపు హైదరాబాద్‌కు రాహుల్ గాంధీ
Follow Us On: X(Twitter)


