కలం, వెబ్ డెస్క్: బాలకృష్ణ నటించిన అఖండ2 (Akhanda 2)కు హైకోర్టులో ఊరట లభించింది. ఈ సినిమా ప్రీమియర్ షో టికెట్ రేట్లను పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన జీవోను నిన్న సింగిల్ బెంచ్ సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చిన సంగతి తెలిసిందే. నేడు డివిజన్ బెంచ్ ఆ ఉత్తర్వులను రద్దు చేసింది. దీంతో పెంచిన రేట్లకే టికెట్లు అందుబాటులో ఉండబోతున్నాయి. అఖండ 2 నిన్న ప్రీమియర్లతో పెద్ద ఎత్తున రిలీజ్ అయింది. పెంచిన రేట్లకే ప్రీమియర్ షో టికెట్లను అభిమానులు బుక్ చేసుకున్నారు. జీవో సస్పెన్షన్ లోనే ఉంటే వాటిని రీఫండ్ చేసేవాళ్లు. కానీ ఇప్పుడు జీవో ఉంటుంది కాబట్టి రీఫండ్ చేయరు. పెరిగిన ధరలకే టికెట్లు అమ్మడం వల్ల తెలంగాణలో అఖండ 2(Akhanda 2) కలెక్షన్లు బాగానే ఉంటాయని టీమ్ చెబుతోంది.
ఈ జీవో విషయంపై సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి(Minister Komatireddy) సంచలన కామెంట్లు చేశారు. ఇక నుంచి తెలంగాణలో ఏ సినిమాకు కూడా టికెట్ రేట్లు పెంచడం ఉండదని మరోసారి ప్రకటించారు. దయచేసి హీరోలు, నిర్మాతలు తమ వద్దకు రావొద్దని కోరారు. ఈ సారి పొరపాటు జరిగిందని.. మరోసారి ఇలా జరగకుండా చూస్తామన్నారు. సినిమా బడ్జెట్ ను తగ్గించుకోవాలని.. హీరోలకు వందల కోట్లు ఎవరు ఇమ్మన్నారు అంటూ ఫైర్ అయ్యారు. ఫ్యామిలీ మొత్తం సినిమాల కోసం థియేటర్లకు వెళ్లే పరిస్థితి లేదని చెప్పారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. మరి ఆయన చెప్పినట్టే ఇక నుంచి తెలంగాణలో ఏ సినిమాకు కూడా టికెట్ రేట్ల హైక్ ఉండదా అనేది వేచి చూడాలి.
Read Also: ఆరు దేశాల్లో ధురంధర్ మూవీ బ్యాన్.. కారణమేంటి?
Follow Us On: X(Twitter)


