కలం, వెబ్ డెస్క్: Tన్యూస్ కు కల్వకుంట్ల కవిత(Kalvakuntla Kavitha) నోటీసులు ఇవ్వడం సంచలనం రేపుతోంది. టీన్యూస్ తో పాటు బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి, బీఆర్ ఎస్ కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుకు కూడా ఆమె నోటీసులిచ్చారు. తన మీద, తన భర్త అనిల్ మీద నిరాధార ఆరోపణలు చేస్తున్నారని.. వారం రోజుల్లో తమకు బహిరంగ క్షమాపణలు చెప్పాలని అందులో తెలిపారు. ఈ సందర్భంగా మాధవరం కృష్ణారావు(Madhavaram Krishna Rao)పై కవిత ఫైర్ అయింది.
‘మాధవరం వెనక ఉన్న గుంటనక్క పేరు త్వరలోనే బయట పెడుతా. కేటీఆర్(KTR) బినామీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి. డెక్కన్ షా కంపెనీ భూముల వ్యవహారంలో నా భర్త ఎప్పుడో బయటకు వచ్చారు. అందులో ఎలాంటి అవినీతికి మేం పాల్పడలేదు. ఆ కంపెనీ తన పక్కనున్న 16 ఎకరాల భూమిని కబ్జా చేసింది. అందులో బాధితులు అందరూ నా దగ్గరకు వచ్చారు. ఆ భూముల్లో కన్ స్ట్రక్షన్ కు అప్పటి బీఆర్ఎస్(BRS) పర్మిసన్ ఇచ్చింది. కేటీఆర్ సంతకం చేస్తేనే కన్ స్ట్రక్చన్ స్టార్ట్ అయింది. ఇండస్ట్రియల్ భూమిని రెసిడెన్షియల్ భూమిగా మార్చుకోవచ్చని కేటీఆర్ ఎలా పర్మిషన్ ఇచ్చారు. అందులో మాధవరం కృష్ణారావు పాత్ర ఏంటో సమాధానం చెప్పాలని కవిత డిమాండ్ చేశారు. హరీశ్‌రావుకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఆ భూముల్లో చేంజ్ ఆఫ్ ల్యాండ్ పర్మిషన్ ఎలా ఇచ్చిందో చెప్పాలన్నారు కవిత.
ఈ వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ అవుతోంది. కవిత(Kalvakuntla Kavitha) జిల్లాల పర్యటన చేస్తూ అక్కడి లోకల్ లీడర్లపై సంచలన ఆరోపణలు చేస్తోంది. దాంతో అక్కడి నేతలు కూడా అదే స్థాయిలో రియాక్ట్ అవుతున్నారు. మొన్న కూకట్ పల్లి వెళ్లి మాధవరం కృష్ణారావు మీద అవినీతి ఆరోపణలు చేస్తే.. ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సంచలన ఆరోపణలు చేశారు కవిత, ఆమె భర్త మీద. కవిత ఎక్కడకు వెళ్లినా అక్కడున్న బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ ఎస్ లీడర్ల మీద విరుచుకుపడుతున్న సంగతి తెలిసిందే. మరి ఈ నోటీసులపై వాళ్లు ఎలా స్పందిస్తారో చూడాలి.
Read Also: ఇది టాస్ మాత్రమే.. : కల్వకుంట్ల కవిత
Follow Us On: Pinterest


