కలం, వెబ్ డెస్క్ : మొన్న పవన్ కల్యాణ్ ఓజీ (OG) సినిమాకు జరిగిందే.. నేడు బాలయ్య నటించిన అఖండ 2కు కూడా జరిగింది. ఓజీ సినిమా ప్రీమియర్ షో, సాధారణ టికెట్ రేట్లను పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన జీవోను హైకోర్టు సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. ఆ టైమ్ లో సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ.. ఇక నుంచి తెలంగాణలో ఏ సినిమాకు కూడా టికెట్ హైక్ ఇవ్వనని చెప్పారు. కానీ బాలకృష్ణ నటించిన అఖండ 2 (Akhanda 2)కు మొన్న 4వ తేదీ ప్రీమియర్ షోలకు, సాధారణ టికెట్ రేట్ల పెపునకు జీవో ఇచ్చారు. కానీ సినిమా 12కు వాయిదా పడింది.
ఇప్పుడు మళ్లీ ప్రీమియర్స్ తో పాటు సాధారణ టికెట్ రేట్లను పెంచుతూ.. పెంచిన రేట్లలో వచ్చిన ఆదాయంలో 20 శాతం వాటాను కార్మికులకు ఇవ్వాలని జీవో ఇచ్చింది. కానీ మళ్లీ షాక్. ఆ జీవోను హైకోర్టు సస్పెండ్ చేసింది. ఓజీ సినిమా తర్వాత అఖండ 2(Akhanda 2)కే జీవో ఇచ్చింది రేవంత్ ప్రభుత్వం. ఈ రెండు సినిమాల విషయంలోనూ ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. దీంతో మున్ముందు రాబోయే సినిమాలకు ఎట్టి పరిస్థితుల్లో టికెట్ రేట్లు పెంచుతూ జీవోలు ఇవ్వకపోవచ్చని అంటున్నారు సినిమా మేథావులు. ఎందుకంటే రెండు సార్లు ఎదురుదెబ్బ పడ్డ తర్వాత.. ప్రభుత్వం మరోసారి ఇలాంటి పని చేయదు. కార్మికులకు లాభం చేకూర్చేలా ప్రభుత్వం జీవోలు ఇస్తున్నా.. అంతిమంగా వాటి వల్ల ఎదురుదెబ్బలు తప్పట్లేదు. కాబట్టి ఇక నుంచి ఏ సినిమాకూ టికెట్ హైక్స్ ఉండకపోవచ్చు.
Read Also: రోజుకు 8 గంటలు ఎలా నిద్రపోవాలి? వరుసగానా.. 4-4 గంటల చొప్పునా..?
Follow Us On: X(Twitter)


