epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

మొన్న బాలయ్య.. నేడు కార్తీ.. ఎదురు దెబ్బలు..

కలం, వెబ్ డెస్క్: మొన్న నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) నటించిన అఖండ 2 ఆగిపోయింది. ఎట్టకేలకు మళ్లీ నేడు ప్రీమియర్స్ తో రిలీజ్ కాబోతోంది. ఇంతలోనే కార్తీ (Karthi) సినిమా రిలీజ్ కు బ్రేక్ పడింది. ఆయన నటించిన ‘అన్నగారు వస్తారు’ సినిమా రేపు రిలీజ్ కావాల్సి ఉండగా.. మద్రాస్ హైకోర్టు నిలిపివేస్తూ స్టే విధించింది. ఈ రెండు సినిమాలకు కామన్ రీజన్ ఒకటే.. అదే, ఫైనాన్షియల్ ఇష్యూ. అన్నగారు వస్తారు మూవీ నిర్మాత జ్ఞానవేల్ గతంలో అర్జున్ లాల్ సుందర్ దాస్ వద్ద రూ.10.35 కోట్లు అప్పుగా తీసుకున్నారు. వడ్డీతో కలిపి ఇప్పటికి మొత్తం రూ.21.78 కోట్లు అయింది. ఈ మొత్తం చెల్లించేదాకా సినిమా రిలీజ్ పై స్టే విధించాలంటూ అర్జున్ దాస్ మద్రాస్ హైకోర్టులో పిటిషన్ వేశారు. విచారించిన కోర్టు మొత్తం చెల్లించేదాకా స్టే విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

దీంతో ఫ్యాన్స్ అయోమయంలో పడ్డారు. అఖండ 2 విషయంలో కూడా ఇలాంటి ఫైనాన్షియల్ ఇష్యూస్ వచ్చాయి. వాటిని క్లియర్ చేస్తే గానీ మూవీ రిలీజ్ కాని పరిస్థితి వచ్చింది. మరి ఆ వివాదాన్ని చూసి అయినా అన్నగారు అన్నగారు వస్తారు టీమ్ అలెర్ట్ అయితే బాగుండేది. ఈ మధ్య చాలా సినిమాలకు ఇలాగే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కామన్ అయిపోయాయి. నిర్మాతలు గత సినిమాలకు తీసుకొచ్చిన అప్పులు ప్రస్తుత హీరోల మూవీలకు అడ్డంకిగా మారుతున్నాయి. రిలీజ్ కు కొన్ని గంటల ముందు బ్రేక్ పడితే ఆ ఎఫెక్ట్ మూవీ టీమ్ తో పాటు డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్ల మీద కూడా పడుద్ది. కాబట్టి ఇక నుంచి రాబోయే సినిమాలు ఇలాంటి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే ముందే క్లియర్ చేసుకుంటే బెటర్.

Read Also: మొక్కజొన్న రైతులకు రూ. 588 కోట్లు

Follow Us On: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>