epaper
Friday, January 16, 2026
spot_img
epaper

IPL vs PSL: యుద్దంలో గెలుపు ఎవరిదంటే..!

కలం డెస్క్: భారత్, పాకిస్థాన్ మధ్య ప్రతి విషయంలో తెలియని పోటీ ఉంటుంది. సారీ.. ప్రతి విషయంలో భారత్‌తో పోటీ పడాలని పాక్ కలగంటూ ఉంటుంది. అందుకే భారత్ ఏ పని చేసినా.. అలాంటి పనినే పాకిస్థాన్ కూడా చేస్తుంది. అది ఏ రంగమైనా.. ఈ ఫార్ములాను మర్చిపోదు. 2007లో భారత్ ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL)ను స్టార్ట్ చేసింది. దానిని చూసిన పాక్ 2016లో పాకిస్థాన్ ప్రీమియర్ లీక్(PSL) అని ఓ టీ20 టోర్నీని స్టార్ట్ చేసింది. ఇప్పుడు ఈ రెండు లీగ్‌ల మధ్య భారీ పోటీ (IPL Vs PSL) నెలకొంది. ఏ టోర్నీ గొప్ప.. ఏది దిబ్బ అని. దీనిపై ఇరు దేశాల వెటరన్స్ మధ్య చిన్నపాటి మాటల యుద్ధం కూడా జరుగుతోంది.

ప్రపంచ క్రికెట్‌లో అత్యంత భారీ, అత్యంత ప్రఖ్యాత, అత్యంత లాభదాయకమైన లీగ్ ఏదంటే.. సందేహమే లేకుండా ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ (IPL). 2008లో ప్రారంభమైనప్పటి నుంచి ఐపీఎల్ గ్లోబల్ క్రికెట్‌కు ఒక కొత్త దిశ చూపింది. ఇక పాకిస్తాన్ సూపర్ లీగ్‌ (PSL) మాత్రం 2016లో మొదలై ఇప్పటికీ ఆరు జట్లతోనే కొనసాగుతోంది. కానీ పాకిస్తాన్ అభిమానులు, అక్కడి మాజీ ఆటగాళ్లలో కొందరు మాత్రం తమ పీఎస్ఎల్‌ను ఐపీఎల్‌తో పోల్చుతూ “మా లీగ్‌ గొప్పది” అని చెప్పడం ఆపడం లేదు.

వసీం అక్రమ్ ‘బోరింగ్’ కామెంట్.. తర్వాత వచ్చిన విమర్శల తుపాన్

పంచ్‌ బౌలర్‌గా ప్రపంచవ్యాప్తంగా పేరున్న వసీం అక్రమ్ ఇటీవల ఐపీఎల్‌ను ‘బోరింగ్ లీగ్’ అని పిలిచారు. “పది జట్లు, 75 మ్యాచ్‌లు… పిల్లలు పెద్దవాళ్ళవుతారు కానీ లీగ్ మాత్రం పూర్తికాదు” అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్య ఒక్కటే పెద్ద దుమారాన్ని రేపింది. ఎందుకంటే పీఎస్ఎల్‌లో కేవలం 34 మ్యాచ్‌లే ఉండగా, ఏడో జట్టును చేర్చాలన్న ఆలోచనకే ప్లేయర్లు దొరకరనే వాస్తవం మాట్లాడుతోంది. దాదాపు పది సంవత్సరాలు గడిచినా, పీఎస్ఎల్ జట్ల సంఖ్య పెరగకపోవడం అదే రుజువు.

ప్రైజ్ మనీ చూస్తే అసలు తేడా అర్థమవుతుంది

ఐపీఎల్, పీఎస్ఎల్‌ల మధ్య (IPL Vs PSL) ఆర్థిక దూరం ఎంత ఉందో బహుమతి మొత్తాలు స్పష్టంగా చెబుతున్నాయి. 2008లో ఐపీఎల్ విజేత రాజస్థాన్ రాయల్స్‌కు రూ.4.8 కోట్లు. 2024లో పీఎస్ఎల్ విజేత ముల్తాన్ సుల్తాన్స్‌కు రూ.4.13 కోట్లు. అంటే 18 ఏళ్ల క్రితం ఐపీఎల్ ఇచ్చిన మొత్తమే, ఇప్పుడూ పీఎస్ఎల్ ఇవ్వలేకపోతోంది! ఇప్పుడు ఐపీఎల్ విజేత జట్టు ₹20 కోట్లు అందుకుంటుంది.

వాళ్లకు ‘ఆప్షన్’ పీఎస్ఎల్

ఇటీవలి కాలంలో కొందరు స్టార్ ఆటగాళ్ల కళ్లు పీఎస్ఎల్ వైపు మళ్లాయి. ఫాఫ్ డు ప్లెసిస్, మొయిన్ అలీ, వరుణ్ వార్నర్ లాంటి వారు. కానీ వాస్తవం ఏమిటంటే.. వీరంతా ఐపీఎల్‌లో చాలా ఏళ్లు ఆడారు. చివరి సీజన్‌లో ఫామ్ లేక రిలీజ్ అయ్యారు. వేలంలో ఎవరు కొనరనే విషయం తెలిసి పీఎస్ఎల్‌ను ఎంచుకున్నారు. దీన్ని పాకిస్తాన్ అభిమానులు పెద్ద విషయంగా చూపిస్తున్నారు కానీ కారణం సింపుల్ ఐపీఎల్‌లో అవకాశం లేకపోవడం.

కార్బిన్ బోష్ ఉదాహరణ తీసుకుంటే సరిపోతుంది. పీఎస్ఎల్‌లో ఆడుతూ ఉండగా, ముంబై ఇండియన్స్ రిప్లేస్‌మెంట్‌గా పిలిస్తే వెంటనే పీఎస్ఎల్ వదిలి ఐపీఎల్‌కు వచ్చేశాడు. ఇది ఐపీఎల్ బ్రాండ్ పవర్‌కు స్పష్టమైన నిదర్శనం.

స్టార్ ప్లేయర్ల మొదటి ఎంపిక

ప్రపంచవ్యాప్తంగా భారీ డిమాండ్ ఉన్న టీ20 స్టార్‌లు:

లసిత్ మలింగ

ఏబీ డివిలియర్స్

జోస్ బట్లర్

గ్లెన్ మ్యాక్స్‌వెల్

క్వింటన్ డి కాక్

వీరంతా ఐపీఎల్‌కు ప్రాధాన్యత ఇచ్చారు. పీఎస్ఎల్‌లో ఆడిన రోజులే లేవు. కరిబియన్ సూపర్‌స్టార్స్ అయిన క్రిస్ గేల్, పొలార్డ్, రస్సెల్, నరైన్, బ్రావో కూడా పీఎస్ఎల్‌లో కొన్నే మ్యాచ్‌లు ఆడారు. అవి కూడా ఎక్కువగా ఐపీఎల్ ముందే ముగిసిన కాలంలో. ఇప్పుడు రెండు లీగ్‌లు ఒకేసారి జరుగుతుండడంతో స్పష్టంగా కనిపిస్తోంది. స్టార్ ప్లేయర్‌లకు మొదటి ఎంపిక ఎప్పటికీ ఐపీఎల్‌ టోర్నీనే.

Read Also: శాలరీ స్లిప్ లేకపోయినా పర్సనల్ లోన్.. ఎలా? రిస్క్ ఏంటి?

Follow Us On: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>