epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

భారత్​పై 50శాతం టారిఫ్స్​: మెక్సికో

కలం, వెబ్​డెస్క్​: అమెరికా విధించిన టారిఫ్స్​తో ఇప్పటికే సతమతమవుతున్న భారత్​పై మరో దేశం టారిఫ్స్​ కత్తిదూసింది. ఇండియా నుంచి వచ్చే దిగుమతులపై 50శాతం సుంకాలు (Mexico Tariffs) విధిస్తున్నట్లు మెక్సికో ప్రకటించింది. విదేశాల నుంచి వచ్చే ఉత్పత్తుల వల్ల తమ దేశీయ మార్కెట్​ దెబ్బతింటోందని, ఉపాధి కరువవుతోందని చెబుతూ మెక్సికో ఈ చర్యకు దిగింది. తమతో వాణిజ్య ఒప్పందం(ట్రేడ్​ డీల్​) లేని భారత్​తోపాటు చైనా, దక్షిణ కొరియా, థాయ్​లాండ్​, ఇండోనేషియా తదితర దేశాలకు పెంచిన టారిఫ్స్ వచ్చే ఏడాది జనవరి 1 నుంచి అమలులోకి వస్తాయని​ చెప్పింది. కొత్త పన్నుల వల్ల తమకు 3.8 బిలియన్ల డాలర్ల అదనపు ఆదాయం సమకూరుతుందని, అలాగే దేశీయ ఉత్పత్తి, ఉపాధి రంగాలకు ఊతం లభిస్తుందని మెక్సికో అంచనా వేస్తోంది. తమ దేశ ఆర్థికాభివృద్ధి కోసమే ఈ టారిఫ్స్​ వేసినట్లు చెబుతున్నప్పటికీ అమెరికాను సంతృప్తి పరిచేందుకే మెక్సికో నిర్ణయం తీసుకున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. కాగా, టారిఫ్స్​పై మెక్సికో నిర్ణయాన్ని ఏకపక్షమని పేర్కొన్న చైనా, దీని​ ప్రభావాన్ని పరిశీలిస్తున్నట్లు చెప్పింది. భారత ప్రభుత్వం నుంచి ఇంకా ఎలాంటి ప్రకటనా రాలేదు.

వీటిపైన సుంకాలు..:

ఆటోపార్ట్స్​, లైట్​ కార్స్​, దుస్తులు, ప్లాస్టిక్స్​, స్టీల్​, గృహోపకరణాలు, బొమ్మలు, టెక్స్​టైల్స్​, ఫర్నిచర్​, ఫుట్​వేర్​, లెదర్​ గూడ్స్​, పేపర్​, కార్డ్​బోర్డ్​, మోటార్​సైకిల్స్​, అల్యూమినియం, ట్రైలర్స్​, గ్లాస్​, సోప్స్​, పెర్​ఫ్యూమ్స్​, కాస్మోటిక్స్​.

భారత్​పై ప్రభావం..:

ఏటా భారత్​ నుంచి 5.3బిలియన్​ డాలర్ల విలువైన ఉత్పత్తులు కెనడాకు ఎగుమతి అవుతాయి. ఇందులో 1 బిలియన్​ డాలర్ల విలువైన ఉత్పత్తులు ఆటో మొబైల్​ రంగం నుంచి వెళతాయి. వోక్స్​వ్యాగన్​, హ్యుండయ్​, నిస్సాన్​, మారుతి సుజుకి కార్లు, విడిభాగాలు వీటిలో ఉన్నాయి. మెక్సికో టారిఫ్స్​(Mexico Tariffs) ప్రభావం వీటిపై గణనీయంగా పడనుంది. భారత్​ నుంచి అత్యధికంగా దక్షిణాఫ్రికా, సౌదీ అరేబియా తర్వాత కార్లు అత్యధికంగా మెక్సికోకు కార్లు ఎగుమతి అవుతున్నాయి. ప్రస్తుత టారిఫ్స్​ తమకు ఇబ్బందికరంగా మారతాయని, కేంద్ర ప్రభుత్వం దీనిపై మెక్సికోతో మాట్లాడాలని ఆటోమొబైల్​ ఇండస్ట్రీ సంఘం కోరుతోంది.

Read Also: బిహార్​లోని సీతామర్హిలో ఎయిడ్స్ కలకలం

Follow Us On: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>