epaper
Monday, March 2, 2026
epaper

11 మంది చిన్నారులు మృతి.. తెలంగాణలో Coldrif సిరప్ బ్యాన్

కోల్డ్‌రిఫ్ సిరప్(Coldrif Syrup) బ్యాన్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో Coldrif సిరప్ తాగిన 11 మంది పిల్లలు చనిపోయారు. దీంతో అప్రమత్తమైన తెలంగాణ డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ ఈ సిరప్ ని నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

తమిళనాడులోని కాంచీపురం జిల్లా, సుంగువర్చతిరంలోని శ్రేసన్ ఫార్మా తయారు చేసిన కోల్డ్‌రిఫ్ సిరప్(Coldrif Syrup) తాగిన మధ్యప్రదేశ్, రాజస్థాన్‌ కి చెందిన 11 మంది పిల్లలు మరణించారు. ఈ నివేదికల గురించి తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అప్రమత్తమైంది. ఈ సిరప్ విషపూరితమైన డైథిలిన్ గ్లైకాల్ (DEG)తో కల్తీ చేయబడిందని ఆరోపణలు వెలువడ్డాయి. దీంతో కోల్డ్‌రిఫ్ సిరప్, బ్యాచ్ నం. SR-13 ను ఎవరైనా తమ దగ్గర ఉంటే వెంటనే వాడటం మానేయాలని, ఆలస్యం చేయకుండా స్థానిక డ్రగ్స్ కంట్రోల్ అధికారులకు నివేదించాలని తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ హెచ్చరికలు జారీ చేసింది.

Read Also: సుహాస్ మూవీ షూటింగ్ ప్రమాదం.. బోల్తా పడిన పడవ
మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>
error: Content is protected !!