కలం, వెబ్ డెస్క్ : సంగారెడ్డి జిల్లా బీరంగూడలో (Beeramguda) జరిగిన హత్య కేసు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. కూతురిని ప్రేమించాడని శ్రావణ్ సాయి (Sravan Sai) అనే అబ్బాయిని ఇంటికి పిలిపించి హత్య చేశారని ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో యువతి తల్లి కీలక విషయాలను బయటపెట్టారు. శ్రావణ్ సాయిని ఇంటికి పిలిచి హత్య చేశామన్న ఆరోపణల్లో నిజం లేదన్నారు. అనారోగ్యంగా ఉందని తమ కూతురుని ఆసుపత్రికి తీసుకెళ్తే… వైద్య పరీక్షలు చేసిన డాక్టర్లు ఆమె నాలుగు నెలల గర్భంతో ఉందని చెప్పారన్నారు.
ఇంటికి పిలిచి హత్య చేశారని బంధువులు ఆరోపిస్తున్న టైంలో అలా చేయలేదని ఆమె చెబుతున్నారు. తన కూతురు నాలుగు నెలల గర్భిణీ అని ఈ విషయంపై నిలదీస్తే శ్రావణ్ పేరు చెప్పిందన్నారు. అయితే తమకి తెలియకుండా కూతురే ఆ యువకుడిని ఇంటికి పిలిచిందని చెప్పారు.
ఇంట్లో అందరు మాట్లాడుతున్న సమయంలో కూతురిపై కోపంతో బ్యాట్ తో కొట్టబోయానన్నారు. అప్పుడు శ్రావణ్ అడ్డుగా రావడంతో తలకు తాకి అపస్మారక స్థితిలోకి వెళ్లాడని పేర్కొన్నారు. అలాగే దెబ్బలతో కూతురు చేయి విరిగిందని చెప్పారు. శ్రావణ్ సాయిని వెంటనే ఆస్పత్రికి తరలించి బంధువులకు, స్నేహితులకు సమాచారం ఇచ్చామంటున్నారు. కావాలని ఆ యువకుడిని కొట్టలేదని చెబుతున్నారు. అయితే, శ్రావణ్ సాయిని ఇంత వరకు ఎప్పుడూ చూడలేదని యువతి తల్లి చెబుతోంది.
Beeramguda Murder Case | కాగా, శ్రావణ్ సాయి తల్లిదండ్రులు చనిపోవడంతో అతను తన మేనత్త, మామ సంరక్షణలో ఉంటున్నాడు. విషయం తెలుసుకున్న వెంటనే హైదరాబాద్ కు వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆస్తి కోసమే తమ బిడ్డను చంపేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇదంతా కావాలని చేశారని.. ఇప్పుడు వాళ్ల కూతురును కొడితే అడ్డం వచ్చినట్లు చెప్పి బుకాయిస్తున్నారని చెబుతున్నారు. శ్రావణ్ ను ఆస్పత్రికి తీసుకొచ్చేలోపే చనిపోయినట్లు డాక్టర్లు చెబుతున్నారని తెలిపారు.
Read Also: ఇద్దరు ఐఏఎస్ అధికారులకు హైకోర్టు నోటీసులు
Follow Us On: Instagram


