కలం, వెబ్ డెస్క్: రాష్ట్రవ్యాప్తంగా గురువారం మొదట విడుతగా స్థానిక ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం 3,834 పంచాయతీల సర్పంచ్ స్థానాలకు, వాటి పరిధిలోని 27,628 వార్డు సభ్యుల ఎన్నికకు పోలింగ్ జరుగుతోంది. పోలింగ్ పలు చోట్లా ప్రశాంతంగా జరుగుతుండగా, మరికొన్ని చోట్లా చెదురు ముదురు ఘటనలు వెలుగుచూస్తున్నాయి. శంషాబాద్ (Shamshabad) పెద్ద షాపూర్‌లో ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన ఓటరుపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఓటు వేయడానికి వెళ్లిన ఓ వ్యక్తి అనుకున్న అభ్యర్థికి కాకుండా వేరే అభ్యర్థికి ఓటు వేశాడు. దీంతో అక్కడే బ్యాలెట్ పేపర్‌ను చింపేశాడు. పోలీసులు అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు.
ఏ ఎన్నికల్లోనైనా బ్యాలట్ పేపర్‌ను చించినా, దాన్ని ధ్వంసం చేసినా, ఓటు వేసినట్లుగా ధృవీకరించే ముద్రను చెరిపేసినా కఠిన చర్యలు తీసుకోబడతాయి. ప్రజా ప్రాతినిధ్య చట్టం (పీపుల్స్ రిప్రెజెంటేషన్ యాక్ట్)లోని సెక్షన్ 136 ప్రకారం కేసు నమోదు చేసే అధికారం రాష్ట్ర, కేంద్ర ఎన్నికల సంఘానికి ఉంటుంది. ఆరు నెలలు జైలుశిక్ష, జరిమానా ఉంటుంది. తెలంగాణ పంచాయతీరాజ్ చట్టంలోని సెక్షన్ 233 ప్రకారం చర్యలు తీసుకునే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది. స్థానిక పోలీసులు కూడా భారత న్యాయ సంహిత చట్టంలోని వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసే అధికారం ఉంది.
Read Also: పార్లమెంటులో CM రేవంత్ సందడి.. BJP, TDP ఎంపీలతో సరదా ముచ్చట్లు
Follow Us On: X(Twitter)


