epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

హైదరాబాద్‌ను హడలెత్తిస్తున్న వర్షాలు..

హైదరాబాద్‌(Hyderabad)ను భారీ వర్షాలు హడలెత్తిస్తున్నాయి. తగ్గాయని ఊపిరి పీల్చుకునేలోపే మళ్ళీ మొదలై నానాతిప్పలు పెడుతున్నాయి. వర్షాలు బాగా పడుతున్నాయని ఆనంద పడాలో? బయటకు కూడా పోనీకుండా చేస్తున్నందుకు బాధపడాలో కూడా నగరవాసులకు అర్థం కావట్లేదు. వారం రోజుల కుండపోత వర్షాల తర్వాత కాస్తంత ఉపశమనం లభించింది అనుకునేలోపే శనివారం మరోసారి వరుణుడు తన ఉగ్రరూపం చూపించాడు. హైదరాబాద్ సహా తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురిపించాడు.

హైదరాబాద్‌(Hyderabad)లోని అమీర్‌పేట, పంజాగుట్ట, ఫిల్మ్‌నగర్, ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, యూసఫ‌గుడ, కోఠి, సుల్తాన్ బజార్, అబిడ్స్, నాంపల్లి, బషీర్‌బాగ్, లక్డీకపూల్, లిబర్టీ, హిమాయత్‌నగర్, నారాయణగూడ, లోయర్ ట్యాంక్‌బండ్, నెక్లెస్ రోడ్, కుత్బుల్లాపూర్, చింతల్ సాయినగర్, మల్కాజ్‌గిరి, ముషీరాబా్, సికింద్రాబాద్, వెస్ట్ మారేడ్‌పల్లి ఇలా నగరమంతా వర్షాలు దంచికొట్టాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ట్రాఫిక్ సమస్యలు తలెత్తాయి. పలు రహదారుల్లో రాకపోకలు నిలిపోయాయి. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది.

వర్షపాతం ఎక్కడ ఎంతంటే..

ములుగు(Mulugu) జిల్లా ఏటూరు నాగారంలో అత్యధికంగా 11 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయింది. ఖమ్మం లింగాలలో10 సెం.మీ, సంగారెడ్డిలోని మొగడంపల్లిలో 9.8 సెం.మీ, ఖమ్మం(Kha) పల్లెగూడెంలో 8.98 సెం.మీ, ములుగు మేడారంలో 8.43 సెం.మీ, సంగారెడ్డి పుల్కల్‌లో 7.45 సెం.మీ, జనగామ గూడూర్‌లో 7.38 సెం.మీల వర్షం కురిసింది.

Read Also: ప్రమోషనల్ కాల్స్‌కు చెక్.. కొత్త యాప్‌ను తెచ్చిన ట్రాయ్
మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>