epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

H​1B, H​4 వీసా ఇంటర్వ్యూలు రద్దు

కలం, వెబ్​డెస్క్​: అమెరికా ప్రభుత్వం కొత్తగా తెచ్చిన వెట్టింగ్​ నిబంధనల ప్రభావం హెచ్​1బీ, హెచ్​4 వీసాల (H1B H4 visa interviews) పై పడింది. ఈ నెల 15 నుంచి జరగాల్సిన వందలాది ఇంటర్వ్యూలను కాన్సులేట్లు రద్దు చేశాయి. ఇందులో హైదరాబాద్​, చెన్నై కాన్సులేట్ల పరిధిలోవీ ఉన్నాయి. ఈ ఇంటర్వ్యూల్లో చాలా వాటిని రీ షెడ్యూల్​ చేస్తూ అభ్యర్థులకు మెయిల్స్​ అందాయి. అధికభాగం వచ్చే ఏడాది మార్చికి రీ షెడ్యూల్​ చేశారు. మరోవైపు ఇప్పటికే బయోమెట్రిక్​ ఇంటర్వ్యూలకు ఇచ్చిన అపాయింట్స్​మెంట్స్​ మాత్రం రద్దు కాలేదని, అవి యథావిధిగా కొనసాగుతాయని కాన్సులేట్​ అధికారులు పేర్కొన్నారు.

ఏమీటీ వెట్టింగ్​?

హెచ్​1బీ వీసా మీద అమెరికాకు వచ్చే అభ్యర్థులు, హెచ్​4 మీద వచ్చే కుటుంబసభ్యుల సోషల్​మీడియా ఖాతాలను వెట్టింగ్​.. అంటే క్షుణ్నంగా పరిశీలించాలని ఇటీవల అమెరికా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. వారి సోషల్​ ఖాతాల్లో అమెరికాకు, మానవహక్కులకు వ్యతిరేకంగా, లేదా ఉగ్రవాద/తీవ్రవాద భావజాలానికి మద్దతుగా పోస్టులు, వీడియోలు ఉంటే సదరు అభ్యర్థి వీసాను తిరస్కరించాలని ఆ ఆదేశాల్లో పేర్కొంది. ఈ ఆదేశాలను డిసెంబర్​ 15 నుంచి అమలు చేయాల్సి ఉండడంతో ఆ ప్రభావం హెచ్​1బీ, హెచ్​4 వీసా ఇంటర్వ్యూల (H1B H4 visa interviews) పై పడింది. అందువల్ల ఈ ఇంటర్వ్యూలను కాన్సులేట్లు వాయిదా వేశాయి.

మనపై ప్రభావమెంత?

‘అమెరికా ఫస్ట్​’ నినాదంతో అధికారంలోకి వచ్చిన ట్రంప్​.. విదేశీ విద్యార్థి, ఉద్యోగ వీసాలపై కఠిన నిబంధనలు అమలుచేస్తున్న సంగతి తెలిసిందే. ఈ వీసాల కారణంగా భారత్​, చైనా తదితర దేశాల నుంచి ఇబ్బడిముబ్బడిగా అమెరికాకు వస్తున్నారని, స్థానికుల ఉపాధి, ఉద్యోగావకాశాలను దెబ్బతీస్తున్నారని ఆయన అనేకసార్లు నేరుగా ప్రస్తావించారు. ఈ పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నమంటూ వీసాలపై కఠిన నిబంధనలు అమలుచేస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే వీసా ఫీజులు భారీగా పెంచారు. అలాగే, వీసా ముగిసినా అక్రమంగా ఉంటున్నారంటూ వేలాది మందిని బలవంతంగా అమెరికా నుంచి తరలించారు. కేసులు పెట్టి, జరిమానాలు విధిస్తున్నారు. విద్యార్థి వీసాలు ఎక్కువగా ఇవ్వకుండా అమెరికాలోని యూనివర్సిటీలు, కాలేజీలకు నిధుల్లో కోత వేస్తున్నారు. దీనికితోడు ప్రస్తుతం హెచ్​1బీ, హెచ్​4 వీసాల అభ్యర్థుల సోషల్​ మీడియా ఖాతాలను వెట్టింగ్​ చేయాలంటూ ఇటీవల సరికొత్త నిబంధన తెచ్చారు. ఇది వేలాది మంది భారతీయులపై ప్రభావం చూపనుంది.

అమెరికా వెళ్లి స్థిరపడాలనుకొంటున్న చాలా మంది భారతీయుల ‘డాలర్​ డ్రీమ్స్​’ కలలు ఇప్పటికే చాలావరకు చెదిరిపోయాయి. తక్కువ వేతనానికి భారతీయులను నియమించుకొనే సాఫ్ట్​వేర్​ కంపెనీలు.. ట్రంప్​ ప్రభుత్వం తెచ్చిన కొత్త నిబంధనలు, భారీ ఫీజుల కారణంగా వెనకంజ వేస్తున్నాయి. హెచ్​1బీ వీసాల్లో కోత పెడుతున్నాయి. దీని ప్రభావం ఇప్పటికే వేలాది మంది భారతీయ ఉన్నతవిద్యావంతులు, ప్రతిభావంతులపై పడింది. దీనికితోడు హెచ్​4 వీసా అభ్యర్థులపైనా వెట్టింగ్​ నిబంధన కొత్త ఇబ్బందులు తెచ్చిపెడుతోంది. హెచ్​1బీ, హెచ్​2ఎ, హెచ్​2బి, హెచ్​3 వీసాతో అమెరికాలో నివసిస్తున్నవాళ్ల కుటుంబసభ్యులకు హెచ్​4 వీసా ఇస్తారు. అంటే జీవిత భాగస్వామి, పెళ్లికాని 21ఏళ్ల లోపు పిల్లలు ఈ వీసా పొందొచ్చు. వీళ్లు తెలిసో తెలియకో తమ సోషల్​ మీడియా ఖాతాల్లో ఏవైనా అనుమానాస్పద పోస్టులు, వీడియోలు పోస్ట్​ చేసినా, షేర్​ చేసినా వీసా తిరస్కరిస్తారు. ఇది పరోక్షంగా హెచ్​1బీ వీసాదారులను ఇబ్బందిలోకి నెట్టడమే.

Read Also: జనాభా లెక్కలపై కేంద్రం ముందడుగు.. రాష్ట్రాలకు కీలక ఆదేశాలు

Follow Us On: Pinterest

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>