గిరిజన సంప్ర‌దాయ నృత్యంతో ఆక‌ట్టుకున్న సీత‌క్క‌!

కలం, ఖమ్మం బ్యూరో: మేడారం జాతర తర్వాత మరొక్కసారి మంత్రి సీతక్క (Minister Seethakka) ఎమ్మెల్యేలతో కలిసి గిరిజన సాంప్రదాయ నృత్యంలో ఆక‌ట్టుకున్నారు. భద్రాచలం (Bhadrachalam)లో నేడు జరిగిన ఆదివాసీ కోయ ఇలవేల్పుల చరిత్ర పుస్తకావిష్కరణ కార్యక్రమంలో మంత్రి సీతక్క పాల్గొన్నారు. అనంతరం సీతక్క తనదైన శైలిలో ఆదివాసీలతో ఆడి పాడి వారిలో ఉత్సాహాన్ని నింపారు. అంతేకాక ఈ గిరిజన సాంప్రదాయ నృత్యంలో పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, అశ్వరావు పేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణతో పాటు, ఐటీడీఏ పీఓ రాహుల్ కూడా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సీతక్క (Seethakka) మాట్లాడుతూ.. ఆదివాసీలు అంటేనే ప్రకృతికి ప్రతిరూపమని ఎంత ఉన్నత స్థాయికి చేరినా కట్టుబాట్లు, ఆచారాలు, పండగలు, సాంప్రదాయాలు విడిచిపెట్టరాదని, అందులో భాగంగానే భావితరాలకు వారి మూలాలను ఈ పుస్తకం గుర్తు చేస్తుందని తెలియజేశారు. అలాగే ప్రతి ఆదివాసీ బిడ్డ ఇంట్లో ఈ పుస్తకం ఉండాలని మంత్రి పేర్కొన్నారు.

Read Also: ‘మంత్రి సీతక్కపై అసత్య ప్రచారం’.. సైబర్ క్రైమ్ లో ఫిర్యాదు!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>