epaper
Friday, January 16, 2026
spot_img
epaper

గచ్చిబౌలి ఎస్సై ట్రాన్స్‌ఫర్.. ‘పొంగులేటి’ కేసే కారణమా?

కలం, వెబ్‌డెస్క్: గచ్చిబౌలి ఎస్సై హబీబుల్లా ఖాన్ (Gachibowli SI Habibulla Khan) మంగళవారం ట్రాన్స్‌ఫర్ అయ్యారు. ఇటీవల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivas Reddy) కుమారుడి మీద గచ్చిబౌలి పీఎస్‌లో కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ కారణంగానే ఈ ఎస్సై ట్రాన్స్ ఫర్ అయినట్టు చర్చ జరుగుతోంది. లా అండ్ ఆర్డర్ విభాగంలో ‘సురక్షిత్ హైదరాబాద్’ అవార్డును అందుకున్న ఎస్సై సడెన్‌గా ట్రాన్స్‌ఫర్ కావడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మంత్రి కొడుకు మీద కేసు పెట్టినందుకే వేకెన్సీ రిజర్వ్ పేరిట ఎస్సై మొహమ్మద్ హబీబుల్లా ఖాన్‌కు కాంగ్రెస్ ప్రభుత్వం పనిష్మెంట్ ఇచ్చిందని విమర్శలు వస్తున్నాయి.

కేసు నేపథ్యం ఇదే..

గండిపేట మండలం, వట్టినాగులపల్లి గ్రామంలో సర్వే నం.245/19లో సతీశ్‌షా అనే వ్యక్తికి 3 ఎకరాల స్థలం ఉన్నది. అది గండిపేట చెరువుకు ఆనుకొని ఉన్న లేక్‌వ్యూ పాయింట్‌ బిట్టు. ఈ స్థలంలో అక్టోబర్‌ 25న రాత్రి 11గంటల సమయంలో దుండగులు ప్రహరీ గోడను ధ్వంసం చేశారని.. నవంబర్‌ 30న దాదాపు 70 మంది బౌన్సర్లు ట్రక్కులు, రిజిస్ట్రేషన్‌ నంబర్‌ లేని నాలుగు బుల్డోజర్లతో విరుచుకపడి ప్రహరీగోడను, ఆ స్థలంలో ఉన్న గోశాలను కూల్చి వేశారని సతీశ్ షా కూతురు పల్లవి షా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదు మేరకు గచ్చిబౌలి ఎస్సై (Gachibowli SI) కేసు నమోదు చేశారు.

రాఘవ కన్‌స్ట్రక్షన్‌పై కేసు..

అడ్డొచ్చిన వారిని చితకబాదారాని, సెక్యూరిటీ సిబ్బందికి సంబంధించిన టెంట్‌ను కూడా పూర్తిగా ధ్వంసం చేశారని కూడా ఆమె ఫిర్యాదులో ఆరోపించారు. గోశాలలో ఉన్న ఫ్యాన్‌లు, ఇతర వస్తువులను ధ్వంసం చేసి, సిబ్బంది సెల్‌ఫోన్‌లను లాక్కెల్లారని కూడా ఆమె ఫిర్యాదులో ఆరోపించారు. పల్లవీషా ఫిర్యాదు మేరకు పొంగులేటి కొడుకు హర్ష రెడ్డి నిర్వహిస్తున్న రాఘవ కన్‌స్ట్రక్షన్‌ (Raghava Constructions) బిల్డర్స్‌తోపాటు మరికొందరి మీద 329(3), 118(1), 324(4), 304(2), 127(2), 351(2) r/w 3(5)సెక్షన్‌ల కింద గచ్చిబౌలి పోలీసులు కేసులు నమోదు చేశారు.

Read Also: తెలంగాణకు పెట్టుబడుల వర్షం.. రెండో రోజు రూ.2.96 లక్షల కోట్లకు ఎంవోయులు

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>