కలం, వెబ్‌డెస్క్: అమెరికా రైతులకు, వ్యవసాయ రంగానికి ఇబ్బందికరంగా మారిన వ్యవసాయ ఉత్పత్తులు, ఎరువుల దిగుమతులు.. ముఖ్యంగా భారత్ నుంచి వస్తున్న బియ్యంపై టారిఫ్స్ (Rice Tariffs) విధించేందుకు అగ్రరాజ్యం అధ్యక్షుడు ట్రంప్ సిద్ధమవుతున్నారు. అమెరికాలోని రైతుల సంక్షేమం కోసం ఉద్దేశించిన మిలియన్ డాలర్ల ప్యాకేజీని సోమవారం ఆయన విడుదల చేశారు. అనంతరం అక్కడి రైతులతో మాట్లాడారు. ఈ సందర్భంగా దేశంలోకి వస్తున్న బియ్యం దిగుమతుల వల్ల ఇబ్బంది పడుతున్నట్లు స్థానిక రైతులు కొందరు ట్రంప్ దృష్టికి తీసుకొచ్చారు.
దీనిపై స్పందించిన ట్రంప్(Trump).. వ్యవసాయ ఉత్పత్తులు, ఎరువుల దిగుమతిపై టారిఫ్స్ (Rice Tariffs) విధించనున్నట్లు చెప్పారు. ‘భారత్ లాంటి ఆసియా దేశాల నుంచి బియ్యం ఇబ్బడిముబ్బడిగా అమెరికాకు వచ్చి పడుతోంది. అలాగే కెనడా నుంచి ఎరువులు వస్తున్నాయి. అమెరికా రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని వీటిపై టారిఫ్స్ విధించే ఆలోచన చేస్తున్నాం’ అని ట్రంప్ అన్నారు. కాగా, ఇప్పటికే విద్యార్థి, వృత్తి నిపుణుల వీసాలపై కఠిన నిబంధనలు తెచ్చిన ట్రంప్.. రష్యా ఆయిల్‌ను కొంటోందంటూ భారత్‌పై సుంకాలూ విధించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు భారత్ నుంచి వచ్చే బియ్యంపైనా టారిఫ్స్ వేస్తామని వార్నింగ్ ఇవ్వడం మనదేశ వ్యవసాయ ఉత్పత్తులపై ప్రభావం చూపనుంది.
Read Also: జపాన్ లో భూకంపం.. ప్రభాస్ సేఫ్టీపై డైరెక్టర్ క్లారిటీ
Follow Us On: Instagram


