కలం డెస్క్ : ఫ్యూచర్ సిటీ సమీపంలో ఒక టౌన్‌షిప్‌ను (Township), ఒక ఫిల్మ్ స్టూడియోను (Film Studio) నిర్మించడానికి సల్మాన్ ఖాన్ (Salman Khan) ముందుకొచ్చారు. సల్మాన్ ఖాన్ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో రూ. 10 వేల కోట్ల పెట్టుబడి పెట్టడానికి రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహనా ఒప్పందం కుదిరింది. ఇది ప్రపంచ స్థాయి ఫిల్మ్ స్టూడియోగా ఉంటుందని ఆ సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. పూర్తి స్థాయిలో ప్రొడక్షన్ ఎకో సిస్టమ్ ఉంటుందని పేర్కొన్నది.
సినిమా, టీవీ, ఓటీటీ (OTT) కంటెంట్, పోస్ట్-ప్రొడక్షన్ తదితర అవసరాలకు తగినట్లుగా అన్ని సౌకర్యాలు, వసతులు స్టూడియోలో ఉంటాయని పేర్కొన్నది. ఇక టౌన్‌షిప్‌లో భాగంగా గోల్ఫ్ కోర్స్, రేస్ కోర్స్, ప్రకృతి సౌందర్యం, ప్రీమియం విల్లాలు, లగ్జరీ సౌకర్యాలు, మౌలిక సదుపాయాలు ఉంటాయని తెలిపింది. సల్మాన్ ఖాన్ (Salman Khan) రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహనా ఒప్పందాన్ని కుదుర్చుకోవడంపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ, ఇది రాష్ట్ర చరిత్రలోనే ఒక మైలురాయిగా నిలిచిపోతుందని, సినీ పరిశ్రమ సృజనాత్మకంగా మారుతుందన్నారు. టౌన్‌షిప్, ఫిల్మ్ స్టూడియో ద్వారా వేలాది మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు.
Read Also: పెట్టుబడి పెట్టే కంపెనీలివే…
Follow Us On: X(Twitter)


