కలం, వెబ్ డెస్క్: ఇండిగో సంక్షభం (Indigo Crisis) కొనసాగుతోంది. మంగళవారం కూడా దేశ వ్యాప్తంగా పలు ఎయిర్ పోర్టుల్లో వందలాది ఫ్లైట్లు రద్దవుతున్నాయి. నేడు హైదరాబాద్, బెంగుళూరులో కలిసి 180 విమానాలను ఇండిగో రద్దు చేసింది. శంషాబాద్ ఎయిర్ పోర్టులో దాదాపు 58 ఫ్లైట్లను రద్దు చేసింది ఇండిగో సంస్థ. బయట నుంచి ఎయిర్ పోర్టుకు రావాల్సిన 14 విమానాలు, ఇక్కడి నుంచి వెళ్లాల్సిన 44 ఫ్లైట్లను రద్దు చేసింది. దీంతో ఆ ఫ్లైట్ల కోసం వెయిట్ చేస్తున్న వారంతా ఇబ్బందులు పడుతున్నారు. అటు విశాఖపట్నం నుంచి బెంగుళూరు, హైదరాబాద్ కు వెళ్లే 6 సర్వీసులు కూడా రద్దయ్యాయి.
దీంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. విశాఖ నుంచి బెంగళూరు, హైదరాబాద్‌కు వెళ్లే 6 ఇండిగో సర్వీసులను రద్దు చేశారు. ఇండిగో సంక్షభం (Indigo Crisis) తగ్గించేందుకు ఆల్టర్ నేట్ ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. స్పైస్ జెట్ సంస్థ దేశ వ్యాప్తంగా 100 అదనపు ఫ్లైట్లను రంగంలోకి దించింది. ఎక్కువగా ఫ్లైట్లు రద్దవుతున్న బెంగుళూరు, ముంబై, హైదరాబాద్, ఢిల్లీ ఎయిర్ పోర్టుల్లో వీటిని ఏర్పాటు చేస్తున్నారు. అటు అడిషనల్ రైళ్లు, ఆర్టీసీ సర్వీసులు నడుపుతోంది ప్రభుత్వం.
Read Also: తెలంగాణ 2026 హాలీడేస్ లిస్ట్ రిలీజ్!
Follow Us On: Pinterest


