కలం, వెబ్ డెస్క్: AI Misuse | ఏఐతో సెలబ్రిటీల(Celebrities)కు ఎక్కువ ఇబ్బందులు వస్తున్నాయి. టెక్నాలజీని అభివృద్ధికి వాడుకుంటే బెటర్. కానీ ఎదుటి వారిని ట్రోల్ చేయడానికి వాడుకోవడం అస్సలు మంచిది కాదు. ఇందులో ఎక్కువగా సెలబ్రిటీలకే ఇబ్బందులు వస్తున్నాయి. ఏఐతో వారి ఫొటోలను రకరకాలుగా మార్చేసి ట్రోల్స్ చేయడం, లేదంటే డీప్ ఫేక్ లాంటివి క్రియేట్ చేసి అభ్యంతరకరంగా తయారు చేయడం లాంటివి చూస్తున్నాం. కామెడీ కోసం చేసినా సరే దానికి ఓ హద్దు అనేది ఉంటుంది. అడ్డూ అదుపు లేకుండా ఇష్టం వచ్చినట్టు సెలబ్రిటీలను కించ పరిచేలా వీడియోలు క్రియేట్ చేయడం అస్సలు మంచిది కాదు.
చిన్న హీరోల నుంచి స్టార్ హీరోల దాకా ఈ ఏఐతో ఇబ్బంది పడుతూనే ఉన్నారు. కొందరు ట్రోలర్లు, మీమర్స్, ఇతరులు ఇష్టారీతిన సెలబ్రిటీలపై పోస్టులు పెట్టేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున, ఎన్టీఆర్, అల్లు అర్జున్, అక్షయ్ కుమార్, హృతిక్ రోషన్ లాంటి స్టార్ హీరోలు ఢిల్లీ హైకోర్టులో ఇలాంటి ట్రోల్స్, డీప్ ఫేక్ వీడియోలపై పిటిషన్లు వేసి ఆర్డర్లు తెచ్చుకున్నారు. అంటే వాళ్లు ఎంత ఇబ్బంది పడుతున్నారో అర్థం చేసుకోవాలి. రష్మిక, శ్రద్ధా కపూర్, విద్యా బాలన్ లాంటి హీరోయిన్లపై అసభ్యకర డీప్ ఫేక్ వీడియోలు క్రియేట్ చేయడం దేశ వ్యాప్తంగా ఎంత సంచలనం రేపిందో చూశాం. ఈ ఏఐ వల్ల ఏది నిజమైన వీడియో, ఏది నిజమైన ఫొటో అనేది గుర్తు పట్టలేని విధంగా తయారైంది.
AI Misuse | సామాన్య జనాలు వాటిని చూసి నిజమే అనుకునే పరిస్థితులున్నాయి. ఇది సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలను ఇబ్బంది పెట్టేలా తయారైంది. ఎంత సెలబ్రిటీలు అయినా వారికి కూడా పర్సనల్ లైఫ్ అనేది ఉంటుంది. వారికి సమాజంలో గౌరవం ఉంటుంది. ఇలాంటి వాటి వల్ల వారి కుటుంబ సభ్యులు కూడా ఇబ్బందులు పడుతున్నారని ఎంతో మంది ఓపెన్ గా మీడియా ముందే చెప్పేస్తున్నారు. నవ్వితే ట్రోల్స్, గట్టిగా మాట్లాడితే ట్రోల్స్, ఏం చేసినా చివరకు మీమ్ లేదా ట్రోల్ కు గురయ్యే పరిస్థితులు ఉన్నాయని సెలబ్రిటీలు ఓపెన్ గా చెబుతూ ఎమోషనల్ అవుతున్నారు. కాబ్టటి టెక్నాలజీని మంచి పనులకు వాడుకోవాలి తప్ప ఇలాంటి వాటి కోసం కాదంటున్నారు నెటిజన్లు.
Read Also: గంభీర్‌కు నాదో సలహా: ఆకాష్ చోప్రా
Follow Us On: X(Twitter)


