అర్జెంటినా ఫుట్‌బాలర్ లియొనెల్ మెస్సీ(Lionel Messi)గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తాజాగా జరిగిన ఎంఎల్‌సీ కప్‌లో మెస్సీ మరోసారి సత్తా చాటాడు. శనివారం (డిసెంబర్ 6) జరిగిన ఎంఎల్ఎస్ కప్ ఫైనల్లో ఇంటర్ మయామీ, వాంకూవర్ వైట్‌క్యాప్స్‌పై 3-1 తేడాతో గెలిచి తమ తొలి ఎంఎల్ఎస్ టైటిల్ కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో రెండుఇంటర్ కీలక అసిస్టులు అందించి జట్టు విజయంలో మెస్సీ కీలక పాత్ర పోషించాడు. దీంతో అతడు తన కెరీర్‌లో సాధించిన ట్రోఫీల సంఖ్య 48కు చేరింది.
మ్యాచ్ ప్రారంభం నుంచే ఇంటర్ మయామీ ఆధిపత్యం కనబరిచింది. ఎనిమిదో నిమిషంలో ఎడియర్ ఓకాంపో చేసిన సెల్ఫ్ గోల్‌తో జట్టు 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. అనంతరం 60వ నిమిషంలో వాంకూవర్ ఆటగాడు అలీ అహ్మద్ గోల్ చేసి స్కోరు సమం చేశాడు. అయితే మ్యాచ్ కీలక దశలో మెస్సీ మాయ మొదలైంది. రొడ్రిగో డి పాల్ కు అద్భుతమైన పాస్ అందించి, ఇంటర్ మయామీకి రెండో గోల్ అందించాడు.
మ్యాచ్ ముగింపు దశలో మెస్సీ(Lionel Messi) మరొక అసిస్టు అందించాడు. ఇంజరీ టైమ్‌లో టాడియో అలెండే గోల్ చేయగా, స్కోరు 3-1గా మారి ఇంటర్ మయామీ విజయం ఖరారైంది. ఈ విజయంతో మెస్సీ మరిన్ని రికార్డులు తన ఖాతాలో వేసుకున్నాడు. రెండు అసిస్టులతో అతడి కెరీర్ అసిస్టుల సంఖ్య 407కు చేరగా, ప్రపంచ ఫుట్‌బాల్‌లో అత్యధిక అసిస్టులు చేసిన ఆటగాడిగా స్థానాన్ని మరింత బలపరచుకున్నాడు. ఇదే కాకుండా ఈ ఎంఎల్ఎస్ సీజన్‌లో 23 అసిస్టులు నమోదు చేసి లీగ్‌లో అగ్రస్థానంలో నిలిచాడు.
ఎంఎల్ఎస్ ప్లేఆఫ్స్‌లో కూడా మెస్సీ అత్యుత్తమ గణాంకాలు నమోదు చేశాడు. మొత్తం ఆరు మ్యాచ్‌ల్లో ఏడు అసిస్టులు చేసి, కొత్త ప్లేఆఫ్స్ రికార్డు నెలకొల్పాడు. మొత్తం 13 గోల్ ఇన్‌వాల్వ్మెంట్లు, ఎనిమిది కీలక అవకాశాల సృష్టి, 21 కీలక పాసులతో ఫైనల్ వరకు కీలక పాత్ర పోషించాడు. ఈ సందర్భంగా ఇంటర్ మయామీ అభిమానులు సోషల్ మీడియాలో మెస్సీకి సెల్యూట్ చేస్తున్నారు. మెస్సీపై పొగడ్తలు కురిపిస్తున్నారు. మెస్సీని మరోసారి “కింగ్ ఆఫ్ ఫుట్‌బాల్”గా అభివర్ణిస్తున్నారు.
Read Also: కవిత నోట ‘బీటీ బ్యాచ్’ మాట
Follow Us On: Instagram


