epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

గ్లోబల్ సమ్మిట్ ఫస్ట్ డే రికార్డు: 2.43 లక్షల కోట్ల పెట్టుబడుల వర్షం

కలం డెస్క్ : తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన గ్లోబల్ సమ్మిట్‌లో (Global Summit) తొలి రోజున రాష్ట్రానికి రూ. 2.43 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు (Investments) వచ్చాయి. ఇన్వెస్ట్ చేస్తున్న కంపెనీలతో అవగాహనా ఒప్పందాలు (MoU) కూడా కుదిరాయి. మొత్తం 35 కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టనున్నట్లు తేల్చి చెప్పాయి. మరికొన్ని కంపెనీలు సానుకూలంగా స్పందించాయి. త్వరలో అవి కూడా స్పష్టమైన నిర్ణయాన్ని తీసుకోనున్నాయి. రాష్ట్రానికి వచ్చిన ఈ పెట్టుబడుల్లో ఎక్కువగా అత్యధికంగా డీప్ టెక్నాలజీ రంగంలో రూ. 75 వేల కోట్లు, సంప్రదాయేతర ఇంధన వనరుల రంగంలో (Renewable Energy) రూ. 39,700 వేల కోట్లు, గ్రీన్ ఎనర్జీ (Green Energy) రంగంలో రూ. 27 వేల కోట్లు, ఏరోస్పేస్-డిఫెన్స్ (Aerospace-Defence) రంగాల్లో రూ. 19,350 కోట్లు, ఏవియేషన్ (Aviation) సెక్టార్‌లో జీఎంఆర్ (GMR) ద్వారా రూ. 15 వేల కోట్లు, మాన్యుఫ్యాక్చరింగ్ (Manufacturing) పరిశ్రమల ఏర్పాటు కోసం రూ. 13,500 కోట్లు, స్టీల్-సిమెంట్ (Steel-Cement) రంగంలో రూ. 7,000 కోట్లు, టెక్స్ టైల్ రంగంలో రూ. 4,000 కోట్ల చొప్పున ఉన్నాయి.

ఫ్యూచర్ సిటీ డెవలప్‌మెంట్ :

డీప్ టెక్నాలజీ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు ఒప్పందం కుదుర్చుకున్న బ్రూక్‌ఫీల్డ్/యాక్సిస్ వెంచర్స్ కంపెనీల కన్సార్టియం తెలంగాణ ప్రభుత్వం నిర్మించే భారత్ ఫ్యూచర్ సిటీ డెవలప్‌మెంట్‌కు కూడా సాయం చేయనున్నట్లు ప్రకటించింది. ‘నెట్ జీరో’ (Net Zero) ఎకో సిస్టమ్‌ను నెలకొల్పేందుకు తోడ్పడనున్నట్లు స్పష్టం చేసింది. స్థిరీకృత పట్టణాభివృద్ధి కోసం ‘విన్ గ్రూప్’ (Vin Group) రూ. 27 వేల కోట్లను సంప్రదాయేతర ఇంధన వనరుల ఉత్పత్తి కోసం, ఈవీ మౌలిక సదుపాయాల కోసం ఇన్వెస్ట్ చేయనున్నట్లు తెలిపింది. ఫ్యూచర్ సిటీలో వరల్డ్ ట్రేడ్ సెంటర్ స్థాపనకు ముందుకొచ్చిన సిడ్బి (SIDBI) స్టార్టప్ ఫండ్ వెయ్యి కోట్లను ఖర్చు చేయనున్నట్లు తెలిపింది.

సోలార్, విండ్ ఎనర్జీపై ఫోకస్ :

రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడుల్లో రెండో అతి పెద్ద రంగంగా సోలార్, విండ్ ఎనర్జీ పరిశ్రమల స్థాపనకు కంపెనీలు ఆసక్తి చూపాయి. ఈ రంగంలో సుమారు రూ. 39,700 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ఇందులో ఎవ్‌రెన్ (Evren/Axis) యాక్సిస్ ఎన్రజీ కంపెనీ రూ. 31,500 కోట్లను, మెగా గ్రూపు రూ. 8,000 కోట్లను పెట్టనున్నాయి. ఇక ఏరో స్పేస్, డిఫెన్స్ రంగాలతో పాటు లాజిస్టిక్స్ లో రూ. 19,350 కోట్ల పెట్టుబడులకు అగ్రిమెంట్‌లు కుదిరాయి. దీనికి తోడు ఏవియేషన్ రంగంలో జీఎంఆర్ గ్రూపు రూ. 15,000 కోట్లను పెట్టనున్నది. ఉత్పత్తి రంగంలో అపోలో మైక్రో సిస్టమ్స్ ఆధ్వర్యంలో రూ. 5,000 కోట్ల పెట్టుబడులు రానున్నాయి. ఎలక్ట్రానిక్స్-హైడ్రోజెన్ టెక్నాలజీ రంగంలో రెన్యూసిస్ (Renewsys), మిడ్ వెస్ట్ (Midwest), అక్షత్ గ్రీన్ టెక్ (Akshat Green Tech) కంపెనీలు సుమారు రూ. 8,000 కోట్లను ఇన్వెస్ట్ చేయనున్నాయి. కృష్ణ, అల్ట్రా బ్రైట్ సిమెంట్ కంపెనీలు రూ. 7,00 కోట్లతో స్టీల్, సిమెంట్ ఫ్యాక్టరీలను పెట్టనున్నాయి. టెక్స్ టైల్స్ రంగంలో సీతారామ్ స్పిన్నర్స్ కంపెనీ రూ. 3,960 కోట్లను పెట్టనున్నది.

Read Also: గ్రామస్తుల మేనిఫెస్టో.. తెలంగాణ డల్లాస్‌గా అంకాపూర్

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>