Mobile Popup Ad
Mobile Popup Ad

చుక్క పాలు లేకుండా కల్తీ పనీర్ తయారీ.. సూరత్ లో 1400 కిలోలు సీజ్

కలం, వెబ్ డెస్క్ : పనీర్ అంటే ముందుగా గుర్తుకు వచ్చేది పాలు.. అలాంటిది పాలు లేకుండా పనీర్ తయారు చేయడం కుదరదని మనం అనుకుంటాం. కానీ, కల్తీ రాయుళ్లు చుక్క పాలు లేకుండా వందల కిలోల పనీర్ తయారు చేస్తున్నారు. గుజరాత్ రాష్ట్రం సూరత్ లోని పాండేసరా ప్రాంతంలో భిడ్ భాజన్ సొసైటీలో లైసెన్స్ లేని డైరీ యూనిట్ పై ఫుడ్ సేఫ్టీ అధికారులు, పోలీసులు దాడి చేశారు. ఈ తనిఖీల్లో సుమారు రూ. 3.08 లక్షల విలువైన 1,401 కిలోల కల్తీ పనీర్ (Adulterated Paneer) ను అధికారులు సీజ్ చేశారు. అలాగే, 16 టిన్ల పామ్ ఆయిల్, 10 లీటర్ల యాసిడ్ తో పాటు ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. పనీర్ టెస్ట్ కోసం ల్యాబ్ కు పంపించగా అధికారులకు షాకింగ్ విషయం తెలిసింది. పనీర్ తయారీలో చుక్క పాలు కూడా ఉపయోగించలేదని రిపోర్టులో తేలింది. పామ్ ఆయిల్, మిల్క్ పౌడర్, ఇండస్ట్రియల్ యాసిడ్ ఉపయోగించి తయారు చేస్తున్నట్లు గుర్తించారు. ఈ నకిలీ దందా నిర్వహిస్తున్న రాజస్థాన్ కు చెందిన మహేశ్ కుమార్ శర్మ (40) ను పోలీసులు అదుపులోకి కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>