Mobile Popup Ad
Mobile Popup Ad

మహిళతో తండ్రి ఎఫైర్.. దాడి చేసి చంపిన కొడుకులు

కలం, వెబ్ డెస్క్: భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం రేపాక గ్రామంలో గతరాత్రి దారుణ ఘటన జరిగింది. వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని ఇద్దరు కుమారులు తండ్రిని (Sons Kill Father) ఘోరంగా చంపేశారు. రాత్రి తండ్రి చేరాలుపై ఇద్దరు కుమారులు దాడి చేసి చంపేశారు. చేరాలు భార్య హైదరాబాద్‌లో ఇద్దరు కుమారుల వద్ద ఉంటోంది. ఈ క్రమంలోనే గ్రామంలోని మరో మహిళతో తండ్రి వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయం తీసుకున్న కుమారులు .. వెంటనే రాత్రి ఇంటికి వచ్చారు. అదే సమయంలో మరో మహిళతో తండ్రి ఉండడం గమనించి కోపంతో ఊగిపోయి ఇద్దరిపై దాడి చేశారు. తీవ్రంగా గాయపడ్డ ఇద్దరికి పరకాల ప్రభుత్వాస్పత్రిలో ప్రాథమిక చికిత్స అందించారు. అక్కడినుంచి వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలోనే ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్సపొందుతూ చేరాలు మృతి చెందాడు. ఈ ఘటనపై రేగొండ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

 

 

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>