కలం, వెబ్ డెస్క్: హైదరాబాద్(Hyderabad) ముషీరాబాద్‌లో దారుణం జరిగింది. డివిజన్ బాపూజీ నగర్ బస్తీలో ఓ వ్యక్తి ఇంట్లోకి చొరబడి 17 ఏళ్ల పవిత్ర అనే అమ్మాయిని కత్తితో పొడిచి దారుణంగా హత్య చేశాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. పోలీసుల దర్యాప్తులో హత్య చేసిన వ్యక్తి అమ్మాయికి దగ్గరి బంధువు ఉమా శంకర్ అని తేలింది.
Hyderabad | పవిత్ర తన కుటుంబ సభ్యులతో కలిసి బాపూజీ నగర్ బస్తీలో ఉంటోంది. ఉమాశంకర్ గత కొన్నిరోజులుగా తనను ప్రేమించాలని, పెళ్ళి చేసుకోవాలని ఒత్తిడి చేస్తూ తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాడు. వేధింపులు భరించలేక ఆ అమ్మాయి తన తల్లికి చెప్పింది. అమ్మాయి ఇంట్లో కూడా యువకుడిపై సదాభిప్రాయం లేకపోవడంతో పవిత్ర పెళ్లి కుదరదని తేల్చి చెప్పింది. కోపంతో రగిలిపోతున్న ఉమాశంకర్… సోమవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో పవిత్రపై కత్తితో దాడి చేసి చంపేపి పారిపోయాడు. పవిత్ర రక్తపు మడుగులో కనిపించడంతో కుటుంబ సభ్యులు షాక్ అయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని పోలీసులు గాంధీ ఆస్పత్రికి తరలించారు. పరారీలో ఉన్న యువకుడి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్టు తెలుస్తోంది.
Read Also: స్టార్‌లింక్ రెసిడెన్షియల్ ప్లాన్ రూ.8,600
Follow Us On: X(Twitter)


