Mobile Popup Ad
Mobile Popup Ad

తెలంగాణలో రానున్న 3 రోజులపాటు వర్షాలు

కలం, వెబ్ డెస్క్: రాష్ట్రంలో రానున్న మూడు రోజులు పలు జిల్లాల్లో వర్షాలు (Rains) కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. శని, ఆది, సోమవారాల్లో పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని స్పష్టం చేసింది. ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్, సంగారెడ్డి, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో సైతం వర్ష సూచనలు ఉన్నాయని వివరించింది. హైదరాబాద్, నల్గొండ, రంగారెడ్డి, జిల్లాల్లో పలు చోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని ప్రకటించింది. ఈ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

మహారాష్ట్ర, కర్ణాటక మీదుగా దక్షిణ తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి ఆవరించి ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. దక్షిణ కోస్తాంధ్రలోని యానాం తీరంలో మరో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని ప్రకటించింది. దీంతో తెలంగాణలో ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. శుక్రవారం తెలంగాణలో అత్యధికంగా ఆదిలాబాద్‌ జిల్లా జైనధ్‌లో 40.5 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత నమోదయ్యింది. నల్గొండ జిల్లా నేరేడుగొమ్ములో 40.1 డిగ్రీలు, ములుగు జిల్లా మంగపేటలో 39.7 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయినట్టు వాతావరణ శాఖ వెల్లడించింది.

 

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>