కలం, వెబ్డెస్స్ : ‘వందేమాతరం’ (Vande Mataram) గేయం 150 ఏళ్ల ఉత్సవాలకు పార్లమెంట్ (Parliament) వేదికయింది. ఉభయ సభలలో వందేమాతరంపై ప్రత్యేక చర్చ కోసం 10 గంటలు కేటాయించగా ప్రధాని నరేంద్రమోడీ (PM Modi) చర్చను ప్రారంభించి ప్రసంగించారు. ఈ సందర్భంగా జవహర్ లాల్ నెహ్రూపై మోడీ తీవ్ర విమర్శలు చేశారు. జాతీయ గేయాన్ని కాంగ్రెస్ పార్టీ ముక్కలు చేసిందని, ‘వందేమాతరం’ ముస్లింలను రెచ్చగొట్టగలదని నెహ్రూ పేర్కొన్నారని మోడీ ఆరోపించారు.
లోక్సభలో “సిగ్గు, సిగ్గు” అనే నినాదాలు వినిపించడంతో.. గత శతాబ్దంలో కొన్ని శక్తులు జాతీయ గీతానికి ద్రోహం చేశాయన్నారు. ఈ విషయాలను భావితరలాలకు చెప్పడం మన కర్తవ్యం అని తెలిపారు. 1937లో మహమ్మద్ అలీ జిన్నా నేతృత్వంలోని ముస్లిం లీగ్ వందేమాతరం (Vande Mataram) గేయానికి వ్యతిరేకంగా చేపట్టిన ఉద్యమాన్ని తప్పుపట్టకుండా నెహ్రూ వందేమాతరం పైనే దర్యాప్తు ప్రారంభించారని మోడీ (modi) పార్లమెంట్ (Parliament) వేదికగా అగ్రహం వ్యక్తం చేశారు
వందేమాతరంను జిన్నా వ్యతిరేకించిన తర్వాత నెహ్రూ సుభాష్ చంద్రబోస్ కు ఒక లేఖ రాశారని మోడీ ప్రస్తావించారు. ఆ లేఖలో ‘వందేమాతరం నేపథ్యాన్ని చదివానని, అది ముస్లింలను రెచ్చగొట్టవచ్చని భావించానని’ నెహ్రూ పేర్కొన్నట్లు మోడీ ఆరోపించారు. బెంగాల్లో కూడా వందేమాతరం ఉపయోగించడాన్ని పరిశీలిస్తామని నెహ్రూ లేఖలో రాశారని మోడీ చెప్పారు.
అలాగే, కాంగ్రెస్ విధించిన ఎమర్జెన్సీలపై ప్రధాని మోదీ(PM Modi) ధ్వజమెత్తారు. ‘‘ వందేమాతరం గేయం 50ఏళ్లు పూర్తి చేసుకున్నప్పుడు, భారత్ బ్రిటిష్ పాలనలో ఉందని, వందేళ్లు పూర్తి చేసుకున్నప్పుడు అత్యవసర పరిస్థితిలో ఉంది. ఆ సమయంలో దేశ భక్తులను జైళ్లలో పెట్టారు. మన దేశానికి స్ఫూర్తినిచ్చిన గేయం ఓ చీకటి కాలాన్ని చూసింది. 150 ఏళ్ల ఉత్సవాల సందర్భంగా జాతీయ గేయానికి తిరిగి పునర్వైభవం తీసుకురావడానికి మనకు మంచి అవకాశం’ అని ప్రధాని మోడీ వెల్లడించారు.
Read Also: చంద్రబాబును చూసి నేర్చుకో రేవంత్..!
Follow Us On : X(Twitter)


