Mobile Popup Ad
Mobile Popup Ad

అభిషేక్ శర్మకు ఐపీఎల్ షాక్.. మ్యాచ్ ఫీజులో కోత!

కలం, స్పోర్ట్స్: కోల్‌కతా నైట్ రైడర్స్‌పై ఘనవిజయం సాధించిన సంతోషంలో ఉన్న సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు (Sunrisers Hyderabad) షాక్ తగిలింది. దూకుడుగా ఆడిన ఓపెనర్ అభిషేక్ శర్మ (Abhishek Sharma) క్రమశిక్షణా చర్య ఎదుర్కోవాల్సి వచ్చింది. ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన మ్యాచ్‌లో ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు అభిషేక్ శర్మ మ్యాచ్ ఫీజులో 25 శాతం కోత విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

మ్యాచ్ సమయంలో అసభ్య పదజాలం వాడినందుకు లెవెల్ 1 నేరం కింద అధికారులు ఈ చర్యలు చేపట్టారు. ఈ విషయాన్ని అభిషేక్ (Abhishek Sharma) అంగీకరించడంతో పాటు మ్యాచ్ రిఫరీ తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉంటానని తెలిపారు. జరిమానాతో పాటు అతని రికార్డులో ఒక డీమెరిట్ పాయింట్‌ను కూడా చేర్చారు. భవిష్యత్తులో ఇటువంటి పొరపాట్లు పునరావృతమైతే కఠిన చర్యలు ఉంటాయని ఐపీఎల్ హెచ్చరించింది.

Read Also: నా ఫామ్ చూసి జలస్ ఫీల్ అవుతున్నారు: విమర్శలకు రహానే చెక్!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>