Mobile Popup Ad
Mobile Popup Ad

ఇంటర్‌నెట్ షట్ డౌన్ !

కలం, సెంట్రల్ డెస్క్: Digital Crisis | క్షణంపాటు అరచేతిలో సెల్ ఫోన్ లేకపోతే, అందులో డేటా పనిచేయకపోతే.. విలవిలలాడిపోయే డిజిటల్ యుగం ఇది. బ్యాంకింగ్ మొదలు ఉపాధి, రవాణా, ఫుడ్ డెలివరీ ఇలా.. అన్ని రంగాల్లో ఇంటర్నెట్ భాగమైపోయింది. ఇంటర్‌నెట్ సర్వాంతర్యామిలా తయారైంది. అలాంటి ఇంటర్నెట్ ద్వారా పనిచేస్తున్న కమ్యూనికేషన్ల వ్యవస్థకు ప్రమాదం పొంచి ఉన్నది. అమెరికా, ఇజ్రాయిల్ దేశాలను ముప్పుతిప్పలు పెట్టేందుకు ఇరాన్ వ్యూహాత్మకంగా ఆలోచిస్తున్నది. ఇప్పటికే హర్మూజ్ జలసంధిని మూసేసి నౌకలపై ఆంక్షలు విధించడంతో ముడిచమురు, గ్యాస్ కోసం దేశాలు ఇబ్బందులు పడుతున్నాయి. దీనికి కొనసాగింపుగా జలసంధి అడుగు నుంచి వెళ్లే ‘అండర్ సీ’ ఇంటర్‌నెట్ కేబుల్ వ్యవస్థపై ఇరాన్ కన్నేసింది. ఆఖరి అస్త్రంగా దాన్ని డీఫంక్ట్ చేసే ఆలోచనలకు పదునుపెట్టింది. అదే జరిగితే దేశాల మధ్య కమ్యూనికేషన్ వ్యవస్థ ప్రమాదంలో పడనున్నది.

ఇప్పటికే అమెరికాకు చెందిన కంపెనీలను ఇరాన్ హెచ్చరించింది. మిడిల్ ఈస్ట్ లోని డేటా, క్లౌడ్ సెంటర్లపై దాడులు చేస్తామని వార్నింగ్ ఇచ్చింది. అన్నట్టుగా దాడులకు దిగింది. అమెజాన్ క్లౌడ్ సెంటర్‌పై మిసైల్ ప్రయోగించింది. మిగిలిన కంపెనీల్లో గుబులు మొదలైంది. ఈ పరిణామం ఎటు దారితీస్తుందోనని టెక్ దిగ్గజ కంపెనీలు ఆందోళన చెందుతున్నాయి. మిడిల్ ఈస్ట్ లోని క్లౌడ్ సెంటర్లు ధ్వంసమైతే లక్షల కోట్ల ఆర్థిక లావాదేవీలుపై తీవ్ర ప్రభావమే పడుతుంది. బ్యాంకింగ్ మొదలు అనేక రంగాలకు చెందిన సర్వీసులు స్థంభించే ప్రమాదమున్నది. అంతిమంగా డిజిటల్ బ్లాకౌట్‌కు దారితీస్తుందా?!

కొద్దిసేపు ట్విట్టర్, ఫేస్ బుక్, వాట్సాప్ లాంటివి పనిచేయకపోతేనే టెన్షన్ పడే జనం ఇప్పుడు నిజంగా డిజిటల్ బ్లాక్ ఔట్ చోటుచేసుకుంటే.. ఈ ఆలోచనే కంగారు పెట్టిస్తున్నది. అనేక వ్యవస్థలు దెబ్బతినే ప్రమాదమున్నది. సోషల్ మీడియా, ఫోన్ పే, గూగుల్ పే, బ్యాంకింగ్ యాప్‌లు పనిచేయకపోవచ్చు. ఓటీటీలపైనా ఎఫెక్టు పడుతుందేమో. అనేక వ్యవస్థలు కుప్పకూలి అస్తవ్యస్థమవుతాయి. ఇప్పటికే వంటింట్లో గ్యాస్ కొరతకు, బండిలో పెట్రోల్ కొరత వెంటాడుతున్నది. నిత్యావసర వస్తువుల ధరలను పెంచేసింది. ఎంతో మందికి ఉపాధిని దూరం చేస్తున్నది. ముంచుకొచ్చే డిజిటల్ బ్లాక్ ఔట్ ముప్పుపై కలం 360 డిగ్రీస్ స్పెషల్ ఎడిషన్ చదివేందుకు కింద ఉన్న పేపర్ ఇమేజ్ పై క్లిక్ చేయండి.

Digital Crisis
Digital Crisis

Read Also: 30 నెలలైనా PRC రిపోర్టు ఎక్కడ? ప్రభుత్వంపై ఉద్యోగ సంఘాల జేఏసీ ఫైర్

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>