కలం, వెబ్డెస్క్: తెలంగాణ ఖ్యాతిని ప్రపంచానికి చాటిచెప్పేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్’ (Telangana Rising Global Summit 2025) అట్టహాసంగా ప్రారంభమైంది. రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ సోమవారం మధ్యాహ్నం 2:15 గంటలకు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
అంతకుముందుకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే రామకృష్ణారావు, ఐటీ విభాగం ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ ప్రసంగించారు. గ్లోబల్ సమ్మిట్ (Global Summit) లక్ష్యాలను వారు అతిథులకు వివరించారు. తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణం ఉందని వివరించారు. గ్లోబల్ సమ్మిట్ ప్రారంభోత్సంలో భాగంగా జాతీయ గీతాన్ని, తెలంగాణ రాష్ట్ర గీతాన్ని ఆలపించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.
Read Also: గ్లోబల్ సమ్మిట్ వర్సెస్ విజయ్ దివస్
Follow Us on: Youtube


